Emta dakkareemde veemdu yemi sedune

ఎంత దక్కరీఁడే వీఁడు యేమి సేతునే
Language

(॥పల్లవి॥)
ఎంత దక్కరీఁడే వీఁడు యేమి సేతునే
మంతనపు చెలులాల మనసియ్యఁ డిదివో

(॥॥)
చేసన్న చేసినవాఁడు చేరి మాటలాడరాదా
అసల నవ్వల నెత్తమాడ నేఁటికి
యీసుద్దు లెఱుఁగ నేను యీతనివేళ గాచుక
సేసవట్టుకున్న దాన చిత్తగించఁ డిదివో

(॥॥)
తప్పక చూచినవాఁడు దండనే కూచుండరాదా
కప్పురపువసంతాలు కడనేఁటికి
తప్పు విచారించనైతి తనకే వొడిగట్టుక
అప్పటనుంటీఁ జూచేను అవుఁగాదనఁడిదివో

(॥॥)
వీడె మిచ్చి కూడేవాఁడు వేరులేక చొక్కరాదా
వాడికసతులకళవళమేఁటికి
యీడనే శ్రీవేంకటేశుఁ డింతసేసి నన్నుఁ గూడె
పాడితో సేవలు సేసేఁబాయలేఁ డిదివో

(||pallavi||)
ĕṁta dakkarīm̐ḍe vīm̐ḍu yemi sedune
maṁtanabu sĕlulāla manasiyyam̐ ḍidivo

(||||)
sesanna sesinavām̐ḍu seri māḍalāḍarādā
asala navvala nĕttamāḍa nem̐ṭigi
yīsuddu lĕṟum̐ga nenu yīdaniveḽa gāsuga
sesavaṭṭugunna dāna sittagiṁcham̐ ḍidivo

(||||)
tappaga sūsinavām̐ḍu daṁḍane kūsuṁḍarādā
kappurabuvasaṁtālu kaḍanem̐ṭigi
tappu visāriṁchanaidi tanage vŏḍigaṭṭuga
appaḍanuṁṭīm̐ jūsenu avum̐gādanam̐ḍidivo

(||||)
vīḍĕ michchi kūḍevām̐ḍu verulega sŏkkarādā
vāḍigasadulagaḽavaḽamem̐ṭigi
yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍiṁtasesi nannum̐ gūḍĕ
pāḍido sevalu sesem̐bāyalem̐ ḍidivo