Emta dadavu vinevu yeduvamti nee veduga

ఎంత దడవు వినేవు యెటువంటి నీ వేడుక
Language

(॥పల్లవి॥)
ఎంత దడవు వినేవు యెటువంటి నీ వేడుక
సంతోసించి కాఁగిలించి చనవియ్యరాదా

(॥ఎంత॥)
సన్నపుటెలుఁగునను సరిఁ బాడుకొంటాఁ జెలి
వన్నెగాఁ దంత్రులు మీఁటి వాయించీ వీణె
చిన్ని చెక్కులవెంట చెమరించి దప్పిగొనె
మన్నించి నీ పుక్కిటితమ్మల మిడరాదా

(॥ఎంత॥)
నిగ్గుదేర మెచ్చుకొంటా నీ నాటకసాల చూచి
వుగ్గళించి తాళము లొత్తీ సతి
అగ్గమై బుసకొట్టి యలసి వున్నది యట్టె
దగ్గరి నీ వురము గందము మెత్తరాదా

(॥ఎంత॥)
పలుమారు నోరునిండాఁ బద్యాలు చదువుకొంటా
పొలఁతి నీ బిరుదులు పొగడీఁ దాను
నెలవై శ్రీవేంకటేశ నీరతుల గుబ్బతిలె
అలమేలుమంగకు నొయ్యనే విసరరాదా

(||pallavi||)
ĕṁta daḍavu vinevu yĕḍuvaṁṭi nī veḍuga
saṁtosiṁchi kām̐giliṁchi sanaviyyarādā

(||ĕṁta||)
sannabuḍĕlum̐gunanu sarim̐ bāḍugŏṁṭām̐ jĕli
vannĕgām̐ daṁtrulu mīm̐ṭi vāyiṁchī vīṇĕ
sinni sĕkkulavĕṁṭa sĕmariṁchi dappigŏnĕ
manniṁchi nī pukkiḍidammala miḍarādā

(||ĕṁta||)
niggudera mĕchchugŏṁṭā nī nāḍagasāla sūsi
vuggaḽiṁchi tāḽamu lŏttī sadi
aggamai busagŏṭṭi yalasi vunnadi yaṭṭĕ
daggari nī vuramu gaṁdamu mĕttarādā

(||ĕṁta||)
palumāru noruniṁḍām̐ badyālu saduvugŏṁṭā
pŏlam̐ti nī birudulu pŏgaḍīm̐ dānu
nĕlavai śhrīveṁkaḍeśha nīradula gubbadilĕ
alamelumaṁgagu nŏyyane visararādā