ఎంత దడవు వట్టునే యీడేరునటే
(॥పల్లవి॥)
ఎంత దడవు వట్టునే యీడేరునటే - వోరి
పంతమాడి చెప్పేను ఆ పని ఇట్టే అయ్యీరా
(॥॥)
యెఱుక చెప్పఁగదవే యింతిరో నీవు-వోరి
చిఱుసేఁతొకటి దలచితివిట్టేరా
గుఱిగా నాతలఁపొనగూడు నటవే-వోరి
కొఱత లేదు కోరిన కోర్కులయ్యీరా
(॥॥)
మనసులోఁగల యట్టె మరియౌనటే-వోరి
పనివడి అది నీకు పైపై నుందిరా
ననుపున అదినేను నమ్ముదునటే-వోరి
అనుమానించకు నీవు అన్నట్టే అయ్యీరా
(॥॥)
చేయి వట్టుక చెప్పవే సిగ్గులేటికి-వోరి
ఆయములు సోఁకె నిఁక ననువాయరా
యీయెడ నేకతమాయ నేలే మఱగు-వోరి
పాయపు శ్రీవేంకటేశ పలికినట్టియ్యీరా
(||pallavi||)
ĕṁta daḍavu vaṭṭune yīḍerunaḍe - vori
paṁtamāḍi sĕppenu ā pani iṭṭe ayyīrā
(||||)
yĕṟuga sĕppam̐gadave yiṁtiro nīvu-vori
siṟusem̐tŏgaḍi dalasidiviṭṭerā
guṟigā nādalam̐pŏnagūḍu naḍave-vori
kŏṟada ledu korina korgulayyīrā
(||||)
manasulom̐gala yaṭṭĕ mariyaunaḍe-vori
panivaḍi adi nīgu paibai nuṁdirā
nanubuna adinenu nammudunaḍe-vori
anumāniṁchagu nīvu annaṭṭe ayyīrā
(||||)
seyi vaṭṭuga sĕppave sigguleḍigi-vori
āyamulu som̐kĕ nim̐ka nanuvāyarā
yīyĕḍa negadamāya nele maṟagu-vori
pāyabu śhrīveṁkaḍeśha paliginaṭṭiyyīrā