Emta dadavainaam gaddaa yelaadaalu

ఎంత దడవైనాఁ గద్దా యేలాటాలు
Language

(॥పల్లవి॥)
ఎంత దడవైనాఁ గద్దా యేలాటాలు
వింతప్రియములు చెప్పి వియ్యమందరాదా

(॥ఎంత॥)
ఆయములంటినప్పుడే అలు కేడదే పతి
చేయి చాఁచినప్పుడే సిగ్గులేడవే
పాయపు విభునినేల పంగించేవే యింకఁ
జాయల సన్నల మొక్కి చనవీయరాదా

(॥ఎంత॥)
కన్నుల నవ్వినప్పుడే కసరేడదే
చన్నులనొ త్తినప్పుడే సటలేడవే
కన్నచోటఁ బతినేల కాకుసేసేవే
విన్నపములెల్లాఁ జేసి విడెమియ్యరాదా

(॥ఎంత॥)
కాఁగిలించుకొన్నప్పుడే కడమేడదే
చేఁగదేర మోవియ్యఁగ చింత యాడదేఁ
యేఁగఁడు శ్రీ వేంకటేశునేల లోఁచేవే
వేఁగక శాసలు వెట్టి వేడుకొనరాదా

(||pallavi||)
ĕṁta daḍavainām̐ gaddā yelāḍālu
viṁtapriyamulu sĕppi viyyamaṁdarādā

(||ĕṁta||)
āyamulaṁṭinappuḍe alu keḍade padi
seyi sām̐sinappuḍe sigguleḍave
pāyabu vibhuninela paṁgiṁcheve yiṁkam̐
jāyala sannala mŏkki sanavīyarādā

(||ĕṁta||)
kannula navvinappuḍe kasareḍade
sannulanŏ ttinappuḍe saḍaleḍave
kannasoḍam̐ badinela kāguseseve
vinnabamulĕllām̐ jesi viḍĕmiyyarādā

(||ĕṁta||)
kām̐giliṁchugŏnnappuḍe kaḍameḍade
sem̐gadera moviyyam̐ga siṁta yāḍadem̐
yem̐gam̐ḍu śhrī veṁkaḍeśhunela lom̐seve
vem̐gaga śhāsalu vĕṭṭi veḍugŏnarādā