ఎంత బోధించి యేమి సేసినఁ దన
(॥పల్లవి॥)
ఎంత బోధించి యేమి సేసినఁ దన-
దొంతికర్మములు తొలఁగీనా
(॥ఎంత॥)
సతతదురాచారజడునకుఁ బుణ్యసం
గతి దలపోసినఁ గలిగీనా
అతిపాపకర్మబోధకుఁడై వెలయుదుష్ణు
మతిఁ దలపోసిన మరి కలిగీనా
(॥ఎంత॥)
బహుజీవహింసాపరుఁడైనవానికి
యిహపరములు దైవ మిచ్చీనా
విహితకర్మములువిడిచినవానికి
సహజాచారము జరిగీనా
(॥ఎంత॥)
దేవదూషకుఁడై తిరిగేటివానికి
దేవతాంతరము దెలిసీనా
శ్రీవేంకటేశ్వరుఁ జింతిపకుండిన
పాపనమతుఁడై బ్రతికీనా
(||pallavi||)
ĕṁta bodhiṁchi yemi sesinam̐ dana-
dŏṁtigarmamulu tŏlam̐gīnā
(||ĕṁta||)
sadatadurāsārajaḍunagum̐ buṇyasaṁ
gadi dalabosinam̐ galigīnā
adibābagarmabodhagum̐ḍai vĕlayuduṣhṇu
madim̐ dalabosina mari kaligīnā
(||ĕṁta||)
bahujīvahiṁsābarum̐ḍainavānigi
yihabaramulu daiva michchīnā
vihidagarmamuluviḍisinavānigi
sahajāsāramu jarigīnā
(||ĕṁta||)
devadūṣhagum̐ḍai tirigeḍivānigi
devadāṁtaramu dĕlisīnā
śhrīveṁkaḍeśhvarum̐ jiṁtibaguṁḍina
pābanamadum̐ḍai bradigīnā