Emta bhaagyavamtumdavo yidivo neevu

ఎంత భాగ్యవంతుఁడవో యిదివో నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత భాగ్యవంతుఁడవో యిదివో నీవు
వింత వింత సుద్దులెల్ల వినిపించీ నాపె

(॥ఎంత॥)
సొలసి సొలసి చూచి చొక్కంచీ నిన్నునదే
కలువరేకు లవంటి కన్నులయాకె
పిలిచి పిలిచి నీకుఁ బ్రియములు చెప్పీనదే
మొలకనవ్వులతోడి మోవియాకె

(॥ఎంత॥)
తగిలి తగిలి నీతోఁ దప్పక మాఁటాడీ నదే
జిగినద్దములవంటి చెక్కులయాపె
పొగడి పొగడి నీతో పొందులు సేసీ నదే
వెగటుఁ జంద్రకళల మొగముదాపె

(॥ఎంత॥)
కమ్మరఁ గమ్మర నిన్నుఁ గాఁగిటఁ గూడీ నదే
కుమ్మరింపుఁ గులుకుల కుచములాపె
యిమ్ముల శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
సమ్మతించె జవ్వనపు చక్కనియాపె

(||pallavi||)
ĕṁta bhāgyavaṁtum̐ḍavo yidivo nīvu
viṁta viṁta suddulĕlla vinibiṁchī nābĕ

(||ĕṁta||)
sŏlasi sŏlasi sūsi sŏkkaṁchī ninnunade
kaluvaregu lavaṁṭi kannulayāgĕ
pilisi pilisi nīgum̐ briyamulu sĕppīnade
mŏlaganavvuladoḍi moviyāgĕ

(||ĕṁta||)
tagili tagili nīdom̐ dappaga mām̐ṭāḍī nade
jiginaddamulavaṁṭi sĕkkulayābĕ
pŏgaḍi pŏgaḍi nīdo pŏṁdulu sesī nade
vĕgaḍum̐ jaṁdragaḽala mŏgamudābĕ

(||ĕṁta||)
kammaram̐ gammara ninnum̐ gām̐giḍam̐ gūḍī nade
kummariṁpum̐ gulugula kusamulābĕ
yimmula śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
sammadiṁchĕ javvanabu sakkaniyābĕ