ఎంత భాగ్యవంతుఁడవో యీకె నీకు దేవులాయ
(॥పల్లవి॥)
ఎంత భాగ్యవంతుఁడవో యీకె నీకు దేవులాయ
వింతలేక యెప్పడూ వినోదించవయ్యా
(॥ఎంత॥)
కన్నుల కొలుకులను కడఁగీ మదరాగము
చన్నుల తుదల రేఁగీ జవ్వనము
నున్నని చెక్కల వెంట నూలు కొనీని కళలు
పిన్నది నీకె తగు బెండ్లాడవయ్యా
(॥ఎంత॥)
నెట్టుకొని మొగమున నిండెను చక్కఁదనము
అట్టె తేనియ లూరీ నాకె మోవిని
తట్టెలై వినయమెల్లాఁ దేరీ నిలుపునను
పెట్టెను సొమ్ములునిండాఁ బెండ్లాడవయ్యా
(॥ఎంత॥)
పిరుఁదు బటువుననుఁ బెనగొనీ సింగారము
కరకమలమునుఁ గైకొనె సేస
యిరవై శ్రీవేంకటేవ యెదఁ బెట్టితి వీకెను
బెరసితివి నిచ్చలు పెండ్లాడవయ్యా
(||pallavi||)
ĕṁta bhāgyavaṁtum̐ḍavo yīgĕ nīgu devulāya
viṁtalega yĕppaḍū vinodiṁchavayyā
(||ĕṁta||)
kannula kŏlugulanu kaḍam̐gī madarāgamu
sannula tudala rem̐gī javvanamu
nunnani sĕkkala vĕṁṭa nūlu kŏnīni kaḽalu
pinnadi nīgĕ tagu bĕṁḍlāḍavayyā
(||ĕṁta||)
nĕṭṭugŏni mŏgamuna niṁḍĕnu sakkam̐danamu
aṭṭĕ teniya lūrī nāgĕ movini
taṭṭĕlai vinayamĕllām̐ derī nilubunanu
pĕṭṭĕnu sŏmmuluniṁḍām̐ bĕṁḍlāḍavayyā
(||ĕṁta||)
pirum̐du baḍuvunanum̐ bĕnagŏnī siṁgāramu
karagamalamunum̐ gaigŏnĕ sesa
yiravai śhrīveṁkaḍeva yĕdam̐ bĕṭṭidi vīgĕnu
bĕrasidivi nichchalu pĕṁḍlāḍavayyā