Emta bhaagyavamtumdavo yeege neegu devulaaya

ఎంత భాగ్యవంతుఁడవో యీకె నీకు దేవులాయ
Language

(॥పల్లవి॥)
ఎంత భాగ్యవంతుఁడవో యీకె నీకు దేవులాయ
వింతలుగా నీకుఁగానే వెదకి తెచ్చితిని

(॥ఎంత॥)
అలివేణి జవరాలు అన్నిటానుఁ జక్కనిది
చిలుకపలుకుల దీ చెలియ
కలిగె నీకుఁ గన్నుల గలికి యీకె యొక్కతె
అలరి ఇట్టె పెండ్లి యాడుదువు రావయ్యా

(॥ఎంత॥)
యిందుముఖి కంబుకంటి యిన్నిటా నందమైనది
చందనగంది యీసకియ
పొందుగా దొరకె నీకు పువ్వుఁబోణి యొక్కతె
అంది యీకె నిట్టె పెండ్లి యాడుదువు రావయ్యా

(॥ఎంత॥)
జక్కవ చన్నులలేమ చక్కెదబొమ్మ బిత్తరి
చొక్కపు సింగారాల దీ సుదతి
దక్కె శ్రీవేంకటేశ యీతరణి నీకు నొకతె
అక్కరతో నిట్టె పెండ్లి యాడుదువు రావయ్యా

(||pallavi||)
ĕṁta bhāgyavaṁtum̐ḍavo yīgĕ nīgu devulāya
viṁtalugā nīgum̐gāne vĕdagi tĕchchidini

(||ĕṁta||)
aliveṇi javarālu anniḍānum̐ jakkanidi
silugabalugula dī sĕliya
kaligĕ nīgum̐ gannula galigi yīgĕ yŏkkadĕ
alari iṭṭĕ pĕṁḍli yāḍuduvu rāvayyā

(||ĕṁta||)
yiṁdumukhi kaṁbugaṁṭi yinniḍā naṁdamainadi
saṁdanagaṁdi yīsagiya
pŏṁdugā dŏragĕ nīgu puvvum̐boṇi yŏkkadĕ
aṁdi yīgĕ niṭṭĕ pĕṁḍli yāḍuduvu rāvayyā

(||ĕṁta||)
jakkava sannulalema sakkĕdabŏmma bittari
sŏkkabu siṁgārāla dī sudadi
dakkĕ śhrīveṁkaḍeśha yīdaraṇi nīgu nŏgadĕ
akkarado niṭṭĕ pĕṁḍli yāḍuduvu rāvayyā