Emta batto neemeemda nee ramanumdu

ఎంత బత్తో నీమీఁద నీ రమణుఁడు
Language

(॥పల్లవి॥)
ఎంత బత్తో నీమీఁద నీ రమణుఁడు
చెంతనుండి ఇయ్యఁగదే చేతికి బాగాలు

(॥॥)
పయ్యదకొంగు పట్టి పతి నీతోఁ బెనఁగీని
ఇయ్యకొని రాఁగదవే ఇంటికి నేఁడు
చెయ్యార నప్పటి నీచెక్కు నొక్కి వేఁడుకొనీ
వుయ్యాలమంచముపైఁ గూచుండఁగదె సరుస

(॥॥)
నెట్టుకొనఁ గాఁగిలించి నిన్ను నొడఁబరచీని
అట్టె కానిమ్మనఁగదె ఆతనితోను
వొట్టుకొని పాదము నీవొడిమీఁదఁ జాఁచీని
గుట్టుతో నానతిచ్చీ నూఁకొనఁగదె మాట

(॥॥)
చెలరేఁగి మంతనాన శ్రీవేంకటేశుఁ డెనసె
ఆలమేలుమంగవు నీవలమఁగదె
పలుమారు నవ్వుతాను బాసికము గట్టీని
చలమెల్లా నీడేరె చల్లఁగదె సేస

(||pallavi||)
ĕṁta batto nīmīm̐da nī ramaṇum̐ḍu
sĕṁtanuṁḍi iyyam̐gade sedigi bāgālu

(||||)
payyadagŏṁgu paṭṭi padi nīdom̐ bĕnam̐gīni
iyyagŏni rām̐gadave iṁṭigi nem̐ḍu
sĕyyāra nappaḍi nīsĕkku nŏkki vem̐ḍugŏnī
vuyyālamaṁchamubaim̐ gūsuṁḍam̐gadĕ sarusa

(||||)
nĕṭṭugŏnam̐ gām̐giliṁchi ninnu nŏḍam̐barasīni
aṭṭĕ kānimmanam̐gadĕ ādanidonu
vŏṭṭugŏni pādamu nīvŏḍimīm̐dam̐ jām̐sīni
guṭṭudo nānadichchī nūm̐kŏnam̐gadĕ māḍa

(||||)
sĕlarem̐gi maṁtanāna śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ
ālamelumaṁgavu nīvalamam̐gadĕ
palumāru navvudānu bāsigamu gaṭṭīni
salamĕllā nīḍerĕ sallam̐gadĕ sesa