ఎంత బత్తి సేసీ నీపై ఇదె సందుగాఁ దాను
(॥పల్లవి॥)
ఎంత బత్తి సేసీ నీపై ఇదె సందుగాఁ దాను
వింతలేక సేవ సేసీ వేడుకెంతో తనకు
(॥॥)
చన్ను లురమున నాని చక్కదిద్దీ నీ నామము
మన్నించితే నేమి యెంతమందెమేళము
చిన్నిపెదవులు దాఁక చెవిలోనే మాటలాడీ
యెన్నరాదు చూడు దీని కెంతగర్వము
(॥॥)
తొడమీఁదఁ దొడవేసి దొరతనమున నీ-
యడుగులొత్తీ నెంత అహంకారము
వెడదగోళ్లు సోఁక విడెము నీకిచ్చీని
తడిచెమటలతోనే తన కెంతపగటు
(॥॥)
జమళిచంకలు రాయ జవ్వాది నీమేనఁ బూసి
తమకించీ నెటువంటి దంటతనము
అమర శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
సముకాన నీకె కెంత సంగడిదాష్టీకము
(||pallavi||)
ĕṁta batti sesī nībai idĕ saṁdugām̐ dānu
viṁtalega seva sesī veḍugĕṁto tanagu
(||||)
sannu luramuna nāni sakkadiddī nī nāmamu
manniṁchide nemi yĕṁtamaṁdĕmeḽamu
sinnibĕdavulu dām̐ka sĕvilone māḍalāḍī
yĕnnarādu sūḍu dīni kĕṁtagarvamu
(||||)
tŏḍamīm̐dam̐ dŏḍavesi dŏradanamuna nī-
yaḍugulŏttī nĕṁta ahaṁkāramu
vĕḍadagoḽlu som̐ka viḍĕmu nīgichchīni
taḍisĕmaḍaladone tana kĕṁtabagaḍu
(||||)
jamaḽisaṁkalu rāya javvādi nīmenam̐ būsi
tamagiṁchī nĕḍuvaṁṭi daṁṭadanamu
amara śhrī veṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
samugāna nīgĕ kĕṁta saṁgaḍidāṣhṭīgamu