ఎంత బత్తి గలవాఁడ వీకె మీఁదను
(॥పల్లవి॥)
ఎంత బత్తి గలవాఁడ వీకె మీఁదను
వింత మీ పొందులు చూచి వెరగయ్యీ మాకును
(॥ఎంత॥)
కప్పురపు లప్పఁ గొని కాంతకొప్పు దాఁక వేసి
అప్పుడే వేఁడుకొనే వదేమయ్యా
రెప్పలెత్తి సారెఁ జూచి రెఁచితిఁగా వలపంటా
దప్పిదేర మోవిచ్చేవు తగుఁదగునయ్యా
(॥ఎంత॥)
మనసు చూడవలసి మర్మము సోఁకఁ దిట్టి
చనవిచ్చి లాలించేవు సంగతౌనయ్యా
కొనగోర గుబ్బలపై గురుతులుగా వా(వ్రా?)ని
వినయాలు సే సే వెంత విద్యవాఁడవయ్యా
(॥ఎంత॥)
బలిమిఁ గాఁగిటఁ గూడి పచ్చిదేర వలపించి
సెలవుల నవ్వేవిది చెల్లునయ్యా
అలమి శ్రీవేంకటే యలమేల్మంగ నురాన
నిలిపి మన్నించేవు నెరవాదివయ్యా
(||pallavi||)
ĕṁta batti galavām̐ḍa vīgĕ mīm̐danu
viṁta mī pŏṁdulu sūsi vĕragayyī māgunu
(||ĕṁta||)
kappurabu lappam̐ gŏni kāṁtagŏppu dām̐ka vesi
appuḍe vem̐ḍugŏne vademayyā
rĕppalĕtti sārĕm̐ jūsi rĕm̐sidim̐gā valabaṁṭā
dappidera movichchevu tagum̐dagunayyā
(||ĕṁta||)
manasu sūḍavalasi marmamu som̐kam̐ diṭṭi
sanavichchi lāliṁchevu saṁgadaunayyā
kŏnagora gubbalabai gurudulugā vā(vrā?)ni
vinayālu se se vĕṁta vidyavām̐ḍavayyā
(||ĕṁta||)
balimim̐ gām̐giḍam̐ gūḍi pachchidera valabiṁchi
sĕlavula navvevidi sĕllunayyā
alami śhrīveṁkaḍe yalamelmaṁga nurāna
nilibi manniṁchevu nĕravādivayyā