ఎంత బలువే నీకు నెడగొల్లకత్తెవటే
(॥పల్లవి॥)
ఎంత బలువే నీకు నెడగొల్లకత్తెవటే
వంతువరుసల యాపె వలచి వుండఁగను
(॥॥)
ఇప్పుడిట్టే వచ్చి పతికేమి చేతులు చాఁచేవే
కప్పురమిచ్చిన యాపె గాచుకుండఁగా
చెప్పేపప్పటి నేమే చెవిలోన నేకతాలు
అప్పసము సేవసేసే యాపె వుండఁగాను
(॥॥)
నలువంక సందుసుడి నవ్వులేమి నవ్వేవే
కొలువుసేసిన యాపె గూచుండఁగా
కలయవచ్చేవు పొత్తు కాతరాన నీకు నీవే
పిలిపించుకొన్నయాపె ప్రేమతోనుండఁగను
(॥॥)
ఆసపడి నీవేల అట్టే కాఁగిట గూడితి
సేసవెట్టి కూడినాపె చేరి వుండఁగా
వాసిఁ బరమపదేశ్వరు శ్రీవేంకటాద్రిపై
చేసుకొంటి వురముపై శ్రీసతి వుండఁగను
(||pallavi||)
ĕṁta baluve nīgu nĕḍagŏllagattĕvaḍe
vaṁtuvarusala yābĕ valasi vuṁḍam̐ganu
(||||)
ippuḍiṭṭe vachchi padigemi sedulu sām̐seve
kappuramichchina yābĕ gāsuguṁḍam̐gā
sĕppebappaḍi neme sĕvilona negadālu
appasamu sevasese yābĕ vuṁḍam̐gānu
(||||)
naluvaṁka saṁdusuḍi navvulemi navveve
kŏluvusesina yābĕ gūsuṁḍam̐gā
kalayavachchevu pŏttu kādarāna nīgu nīve
pilibiṁchugŏnnayābĕ premadonuṁḍam̐ganu
(||||)
āsabaḍi nīvela aṭṭe kām̐giḍa gūḍidi
sesavĕṭṭi kūḍinābĕ seri vuṁḍam̐gā
vāsim̐ baramabadeśhvaru śhrīveṁkaḍādribai
sesugŏṁṭi vuramubai śhrīsadi vuṁḍam̐ganu