ఎంత బలిమి సేసినా నేమి పనికి వచ్చీని
(॥పల్లవి॥)
ఎంత బలిమి సేసినా నేమి పనికి వచ్చీని
మంతు కెక్క భాగవతమహిమనే కాక
(॥ఎంత॥)
భవపాశబంధములు పక్కుననుఁ దెగునా
వివరించి హరి గొల్పి విన్నవించకా
ధ్రువమైన యనాది దురితములు వాసునా
చవిగాను తిరుమంత్రము జపియించకా
(॥ఎంత॥)
అక్కజపు కామక్రోధము లంతలోనే మానునా
మ్రొక్కుచు గోవిందునకు మొఱవెట్టకా
వెక్కసపు కర్మములు విడిచి తానే పోవునా
మక్కువతో శ్రీవైష్ణవమతము గైకొనకా
(॥ఎంత॥)
కదిమి నా యజ్ఞానాంధకార మడఁగునా
యెదలోన శ్రీవేంకటేశుఁ గానకా
సదరానఁ బొదిగిన చంచల ముడుగునా
మొదల నలమేల్మంగ ముదలనే కాకా
(||pallavi||)
ĕṁta balimi sesinā nemi panigi vachchīni
maṁtu kĕkka bhāgavadamahimane kāga
(||ĕṁta||)
bhavabāśhabaṁdhamulu pakkunanum̐ dĕgunā
vivariṁchi hari gŏlbi vinnaviṁchagā
dhruvamaina yanādi duridamulu vāsunā
savigānu tirumaṁtramu jabiyiṁchagā
(||ĕṁta||)
akkajabu kāmakrodhamu laṁtalone mānunā
mrŏkkusu goviṁdunagu mŏṟavĕṭṭagā
vĕkkasabu karmamulu viḍisi tāne povunā
makkuvado śhrīvaiṣhṇavamadamu gaigŏnagā
(||ĕṁta||)
kadimi nā yajñānāṁdhagāra maḍam̐gunā
yĕdalona śhrīveṁkaḍeśhum̐ gānagā
sadarānam̐ bŏdigina saṁchala muḍugunā
mŏdala nalamelmaṁga mudalane kāgā