Emta baasalu sesinaa yevvarunu nammaru

ఎంత బాసలు సేసినా యెవ్వరును నమ్మరు
Language

(॥పల్లవి॥)
ఎంత బాసలు సేసినా యెవ్వరును నమ్మరు
చెంత నీ మచ్చము ఆపెచేత నుంది గనక

(॥ఎంత॥)
నీ వేలి వుంగరము నెలఁత దాఁ బెట్టుకొని
వావి చెప్పీ నీకుఁదాను వదినంటాను
కావిరి నీవిఁక లోనుగాక వుండినాను నీ-
దేవులనే అడుదురు తెఱవ లిందరును

(॥ఎంత॥)
గిద్దించి నీ మెడనున్న కంఠమాల దాఁ బెట్టుక
సుద్దులెల్లాఁ జెప్పీని చుట్టమనంటా
బుద్దుగాదనుచు నొకడఁబరచి యేమిచెప్పినా
అద్దుక నీ పొందుదని అడుదురు సతులు

(॥ఎంత॥)
కడియాలు నీ చేతివి గక్కనఁ దాఁ బెట్టుకొని
అడియాలాలు చెప్పీని ఆల నంటాను
అడరి శ్రీవేంకటేశ అలమేలుమంగను
జడియఁ గూడితి వాకెసవతెందు రింతులు

(||pallavi||)
ĕṁta bāsalu sesinā yĕvvarunu nammaru
sĕṁta nī machchamu ābĕseda nuṁdi ganaga

(||ĕṁta||)
nī veli vuṁgaramu nĕlam̐ta dām̐ bĕṭṭugŏni
vāvi sĕppī nīgum̐dānu vadinaṁṭānu
kāviri nīvim̐ka lonugāga vuṁḍinānu nī-
devulane aḍuduru tĕṟava liṁdarunu

(||ĕṁta||)
giddiṁchi nī mĕḍanunna kaṁṭhamāla dām̐ bĕṭṭuga
suddulĕllām̐ jĕppīni suṭṭamanaṁṭā
buddugādanusu nŏgaḍam̐barasi yemisĕppinā
adduga nī pŏṁdudani aḍuduru sadulu

(||ĕṁta||)
kaḍiyālu nī sedivi gakkanam̐ dām̐ bĕṭṭugŏni
aḍiyālālu sĕppīni āla naṁṭānu
aḍari śhrīveṁkaḍeśha alamelumaṁganu
jaḍiyam̐ gūḍidi vāgĕsavadĕṁdu riṁtulu