Emta baamto yaabe neegu imdugu doragomtivi

ఎంత బాఁతో యాపె నీకు ఇందుకు దొరకొంటివి
Language

(॥పల్లవి॥)
ఎంత బాఁతో యాపె నీకు ఇందుకు దొరకొంటివి
పొత నన్నొడఁబరచి పొసఁగఁ జెప్పేవు

(॥ఎంత॥)
చెలరేఁగి యాపె నీకుఁ జేసేటి విన్నపాలెల్లా
పలుమారు నూఁకొని తప్పక వినేవు
యెలమి నప్పటి నీకు నిచ్చేటి కానుకలెల్లా
అలరుచుఁ జేయి చాఁచి యందుకొనేవు

(॥ఎంత॥)
వేడుకతో నాపె నీకు విందులు వెట్టినందుకు
ఆడనుండి సారె సారె నారగించేవు
జోడు గూడి నిన్నుఁ గడుఁ జొక్కించిన రతులకు
యీడకు వచ్చి నాతోను యెంతో కొనియాడేవు

(॥ఎంత॥)
కూరిమితో నాపె నిన్నుఁ గొసరి నవ్వినందుకు
చేరి కాఁగిలించుకొని చెక్కునొక్కేవు
యీరీతి శ్రీవేంకటేశ యింతలో నన్నేలితివి
మేరమీర కాపెతోడ మేలమాడేవు

(||pallavi||)
ĕṁta bām̐to yābĕ nīgu iṁdugu dŏragŏṁṭivi
pŏda nannŏḍam̐barasi pŏsam̐gam̐ jĕppevu

(||ĕṁta||)
sĕlarem̐gi yābĕ nīgum̐ jeseḍi vinnabālĕllā
palumāru nūm̐kŏni tappaga vinevu
yĕlami nappaḍi nīgu nichcheḍi kānugalĕllā
alarusum̐ jeyi sām̐si yaṁdugŏnevu

(||ĕṁta||)
veḍugado nābĕ nīgu viṁdulu vĕṭṭinaṁdugu
āḍanuṁḍi sārĕ sārĕ nāragiṁchevu
joḍu gūḍi ninnum̐ gaḍum̐ jŏkkiṁchina radulagu
yīḍagu vachchi nādonu yĕṁto kŏniyāḍevu

(||ĕṁta||)
kūrimido nābĕ ninnum̐ gŏsari navvinaṁdugu
seri kām̐giliṁchugŏni sĕkkunŏkkevu
yīrīdi śhrīveṁkaḍeśha yiṁtalo nannelidivi
meramīra kābĕdoḍa melamāḍevu