Emta baamtibadevu maagemi seppevu

ఎంత బాఁతిపడేవు మాకేమి చెప్పేవు
Language

(॥పల్లవి॥)
ఎంత బాఁతిపడేవు మాకేమి చెప్పేవు
వింతలింకా నేమున్నవో వెదకి చేకోవయ్యా

(॥ఎంత॥)
కన్నే చక్కనిందంటాను కడుఁగడుఁ బొగడేవు
వన్నెగా పటము మీఁద వ్రాసుకోవయ్యా
చన్నులు గొప్పలంటాను సారెఁ జేతనంటేవు
వున్నతి వేడుకైతే నీవొళ్ళ నొత్తుకొవయ్యా

(॥ఎంత॥)
బామపిఱుఁదు గొప్పంటా బలుమారు మెచ్చేవు
ప్రేమ నింకాఁ బోదిసేసి పెంచవయ్యా
మోము గడుసోగంటాను మునుకొని చూచేవు
వేమరుఁ దలపోసుకో వినోదించవయ్యా

(॥ఎంత॥)
చెలికొప్పు మూరెఁడంటాఁ జేరిచేరి కొలచేవు
పిలిచి ముత్యాలసేస పెట్టవయ్యా
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
ఇల నన్నేలితి వాకె నింకా మన్నించవయ్యా

(||pallavi||)
ĕṁta bām̐tibaḍevu māgemi sĕppevu
viṁtaliṁkā nemunnavo vĕdagi segovayyā

(||ĕṁta||)
kanne sakkaniṁdaṁṭānu kaḍum̐gaḍum̐ bŏgaḍevu
vannĕgā paḍamu mīm̐da vrāsugovayyā
sannulu gŏppalaṁṭānu sārĕm̐ jedanaṁṭevu
vunnadi veḍugaide nīvŏḽḽa nŏttugŏvayyā

(||ĕṁta||)
bāmabiṟum̐du gŏppaṁṭā balumāru mĕchchevu
prema niṁkām̐ bodisesi pĕṁchavayyā
momu gaḍusogaṁṭānu munugŏni sūsevu
vemarum̐ dalabosugo vinodiṁchavayyā

(||ĕṁta||)
sĕligŏppu mūrĕm̐ḍaṁṭām̐ jeriseri kŏlasevu
pilisi mutyālasesa pĕṭṭavayyā
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
ila nannelidi vāgĕ niṁkā manniṁchavayyā