Emta baamteyano neegu yeebedodi pomdulu

ఎంత బాఁతేయనో నీకు యీపెతోడి పొందులు
Language

(॥పల్లవి॥)
ఎంత బాఁతేయనో నీకు యీపెతోడి పొందులు
చెంతనున్న వారికెల్లాఁ జెప్పఁ గొత్తలాయను

(॥ఎంత॥)
వెక్కసపు మాఃటలాడి వేడుకలు వెడరేఁచి
చెక్కు నొక్కి వేఁడుకొని చెలియ నిన్ను
వొక్కటనే కూడపోసె నుందండాలు వినయాలు
తక్కరితనా లివెల్లా తనకే తగును

(॥ఎంత॥)
గోరికొన నిన్ను నూఁది గుట్టున నప్పటి నీకు
సారెకు మోవితేనెలు చవి చూపీని
కూరిమితో దండ గుచ్చి కుచ్చితము మచ్చికయు
దారకపుచేఁత లివి తనకే తగును

(॥ఎంత॥)
బొమ్మలను జంకించి పొంచి కాఁగిటనుఁ గూడి
చిమ్ముచు నలమేల్మంగ శ్రీవేంకటేశ
సమ్మతుల జంటసేసీ చలములు సరసాలు
తమ్మికంటి యీచందము తనకే తగును

(||pallavi||)
ĕṁta bām̐teyano nīgu yībĕdoḍi pŏṁdulu
sĕṁtanunna vārigĕllām̐ jĕppam̐ gŏttalāyanu

(||ĕṁta||)
vĕkkasabu māḥṭalāḍi veḍugalu vĕḍarem̐si
sĕkku nŏkki vem̐ḍugŏni sĕliya ninnu
vŏkkaḍane kūḍabosĕ nuṁdaṁḍālu vinayālu
takkaridanā livĕllā tanage tagunu

(||ĕṁta||)
gorigŏna ninnu nūm̐di guṭṭuna nappaḍi nīgu
sārĕgu movidenĕlu savi sūbīni
kūrimido daṁḍa guchchi kuchchidamu machchigayu
dāragabusem̐ta livi tanage tagunu

(||ĕṁta||)
bŏmmalanu jaṁkiṁchi pŏṁchi kām̐giḍanum̐ gūḍi
simmusu nalamelmaṁga śhrīveṁkaḍeśha
sammadula jaṁṭasesī salamulu sarasālu
tammigaṁṭi yīsaṁdamu tanage tagunu