Emta aasodagaamdavu yemi seppedi

ఎంత ఆసోదకాఁడవు యేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంత ఆసోదకాఁడవు యేమి చెప్పేది
దొంతి వెట్టేవు వలపు తొయ్యలుల మీఁదను

(॥ఎంత॥)
చేరఁడేసికన్నులాపె చెలి నీకొలువు సేసీ
బారెఁడేసినెరులాపె పాదా లొత్తీని
సారపుఁ బెదవులాపె చౌలుగా మాఁట లాడీ
యీరీతి మాతో పొందు లింకా నీకు వలెనా

(॥ఎంత॥)
పట్టెఁ డేసిగుబ్బలాపె బాగా లిచ్చీ నీకు
జుట్టెఁ డేసిపాదాలాపె సురటి వట్టీ
అట్టె పిడికెఁడునడుమాపె నీకుఁ గుంచె వేసీ
జట్టిగ నాతో సరసము లాడవలెనా

(॥ఎంత॥)
నల్లెఁడేసిగోళ్లాపె ననుపులు నీకుఁజేసీ
ముళ్లెఁడేసినవ్వులాపె మోము చూపీని
యిల్లిదె శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
వెల్లవిరి నాపైఁ జేయి వేయ నింకావలెనా

(||pallavi||)
ĕṁta āsodagām̐ḍavu yemi sĕppedi
dŏṁti vĕṭṭevu valabu tŏyyalula mīm̐danu

(||ĕṁta||)
seram̐ḍesigannulābĕ sĕli nīgŏluvu sesī
bārĕm̐ḍesinĕrulābĕ pādā lŏttīni
sārabum̐ bĕdavulābĕ saulugā mām̐ṭa lāḍī
yīrīdi mādo pŏṁdu liṁkā nīgu valĕnā

(||ĕṁta||)
paṭṭĕm̐ ḍesigubbalābĕ bāgā lichchī nīgu
juṭṭĕm̐ ḍesibādālābĕ suraḍi vaṭṭī
aṭṭĕ piḍigĕm̐ḍunaḍumābĕ nīgum̐ guṁchĕ vesī
jaṭṭiga nādo sarasamu lāḍavalĕnā

(||ĕṁta||)
nallĕm̐ḍesigoḽlābĕ nanubulu nīgum̐jesī
muḽlĕm̐ḍesinavvulābĕ momu sūbīni
yillidĕ śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
vĕllaviri nābaim̐ jeyi veya niṁkāvalĕnā