Empusu naa kaallidamdela pattene

ఏఁపుచు నా కాళ్లితఁడేల పట్టేనె
Language

(॥పల్లవి॥)
ఏఁపుచు నా కాళ్లితఁడేల పట్టేనె
రాఁపు సేసి నాకుఁ బెద్దమోఁపు గట్టినట్లు

(॥ఏఁపుచు॥)
తలమాసి కోకమాసి తాపమున నుండంగాను
యెలయించి యితఁడు నన్నేల యేఁచీనే
మలినమై దేహమెల్ల మఱిచినఁ దలఁపించి
వులికి కాలఁగఁ గొఱవులఁజూఁడినట్లు

(॥ఏఁపుచు॥)
కూడుఁబాసి నీటిఁబాసి కొరమాలి వుండఁగాను
యేడనుండో వచ్చి యీతఁ డేల పోరీనే
వేడుక లన్నియు మాని వేదనల నుండఁగాను
కాఁడినపోట్లలోన కత్తిఁగోసినట్లు

(॥ఏఁపుచు॥)
తల్లిఁబాసి యిల్లువాసి తరిలేక వుండఁగాను
యెల్లగా కౌఁగిట నితఁ డేల నొక్కీనే
చెల్లునంటా నన్ను గూడి శ్రీ వేంకటేశుండు
ముల్లు ముంటనే తీసి మోసపుచ్చినట్లు

(||pallavi||)
em̐pusu nā kāḽlidam̐ḍela paṭṭenĕ
rām̐pu sesi nāgum̐ bĕddamom̐pu gaṭṭinaṭlu

(||em̐pusu||)
talamāsi kogamāsi tābamuna nuṁḍaṁgānu
yĕlayiṁchi yidam̐ḍu nannela yem̐sīne
malinamai dehamĕlla maṟisinam̐ dalam̐piṁchi
vuligi kālam̐gam̐ gŏṟavulam̐jūm̐ḍinaṭlu

(||em̐pusu||)
kūḍum̐bāsi nīḍim̐bāsi kŏramāli vuṁḍam̐gānu
yeḍanuṁḍo vachchi yīdam̐ ḍela porīne
veḍuga lanniyu māni vedanala nuṁḍam̐gānu
kām̐ḍinaboṭlalona kattim̐gosinaṭlu

(||em̐pusu||)
tallim̐bāsi yilluvāsi tarilega vuṁḍam̐gānu
yĕllagā kaum̐giḍa nidam̐ ḍela nŏkkīne
sĕllunaṁṭā nannu gūḍi śhrī veṁkaḍeśhuṁḍu
mullu muṁṭane tīsi mosabuchchinaṭlu