ఏఁపులేల వూఁపులేల యెడమాటలేల ఇఁక
(॥పల్లవి॥)
ఏఁపులేల వూఁపులేల యెడమాటలేల ఇఁక
రాఁపులెల్లాఁ జక్కనయ్యీ రమ్మనవే తన్నును
(॥ఏపు॥)
అసము దించక బీరాలాడీఁగాక తాను
నసిగాటుఁ దత్తరము నాకంటెఁబో
ముసిముసి నవ్వు వచ్చీ మోముమోము చూచితేను
రసికుఁ డన్నిటానౌను రమ్మనవే తన్నును
(॥ఏపు॥)
తెచ్చుకోలుఁదెలివితో తెగువలాడీఁగాక
నచ్చుకొట్టే వినయాలు నాకంటెఁబో
పెచ్చువెరిగేది చూచి పెదవులే గొణఁగీని
రచ్చలో సుద్దులు మాని రమ్మనవే తన్నును
(॥ఏపు॥)
ప్రియమునఁ గాఁగిలించి బిగిసీఁగాక తాను
నయగారిమేమఱపు నాకంటెఁబో
దయ శ్రీవేంకటపతి తానే నన్నుఁ గూడె
రయమున దినమును రమ్మనవే తన్నును
(||pallavi||)
em̐pulela vūm̐pulela yĕḍamāḍalela im̐ka
rām̐pulĕllām̐ jakkanayyī rammanave tannunu
(||ebu||)
asamu diṁchaga bīrālāḍīm̐gāga tānu
nasigāḍum̐ dattaramu nāgaṁṭĕm̐bo
musimusi navvu vachchī momumomu sūsidenu
rasigum̐ ḍanniḍānaunu rammanave tannunu
(||ebu||)
tĕchchugolum̐dĕlivido tĕguvalāḍīm̐gāga
nachchugŏṭṭe vinayālu nāgaṁṭĕm̐bo
pĕchchuvĕrigedi sūsi pĕdavule gŏṇam̐gīni
rachchalo suddulu māni rammanave tannunu
(||ebu||)
priyamunam̐ gām̐giliṁchi bigisīm̐gāga tānu
nayagārimemaṟabu nāgaṁṭĕm̐bo
daya śhrīveṁkaḍabadi tāne nannum̐ gūḍĕ
rayamuna dinamunu rammanave tannunu