ఏమోయి నేనెఱఁగనా యెంతకెంత సేసేవు
(॥పల్లవి॥)
ఏమోయి నేనెఱఁగనా యెంతకెంత సేసేవు
కామతంత్రముల కివి కందువలుగాక
(॥ఏమో॥)
ఈకడ దిట్టితినంటా నెగ్గులేల పట్టేవు
నాకు నీపైఁ గోపమా నగితిఁగాక
కైకొని జంకింతునంటా కమ్మటిని దూరేవు
చేకొన్నపగదాననా చెలిమిగాక
(॥ఏమో॥)
పొలయలు కలకె పొగిలేవు రానంటా
చలమా నీతో నాకు చవులుగాక
పలుకనైతినంటా పై పైఁ జింతించేవు
చలపట్టినదాననా సరసముగాక
(॥ఏమో॥)
గుట్టుతో నేనుండఁగాను కొసరేవు రానంటా
చిట్టకపుదాననా సిగ్గులుగాక
గట్టిగా శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
ఱట్టుచేసేనా నిన్ను జట్టిగొనేఁగాక
(||pallavi||)
emoyi nenĕṟam̐ganā yĕṁtagĕṁta sesevu
kāmadaṁtramula kivi kaṁduvalugāga
(||emo||)
īgaḍa diṭṭidinaṁṭā nĕggulela paṭṭevu
nāgu nībaim̐ gobamā nagidim̐gāga
kaigŏni jaṁkiṁtunaṁṭā kammaḍini dūrevu
segŏnnabagadānanā sĕlimigāga
(||emo||)
pŏlayalu kalagĕ pŏgilevu rānaṁṭā
salamā nīdo nāgu savulugāga
paluganaidinaṁṭā pai paim̐ jiṁtiṁchevu
salabaṭṭinadānanā sarasamugāga
(||emo||)
guṭṭudo nenuṁḍam̐gānu kŏsarevu rānaṁṭā
siṭṭagabudānanā siggulugāga
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
ṟaṭṭusesenā ninnu jaṭṭigŏnem̐gāga