Emoyi nannu neraalemchamga dosamugaadaa

ఏమోయి నన్ను నేరాలెంచఁగ దోసముగాదా
Language

(॥పల్లవి॥)
ఏమోయి నన్ను నేరాలెంచఁగ దోసముగాదా
రామను నాతోడిదేల రావోయి నీవు

(॥ఏమో॥)
పిలువనా మాయింటికి ప్రియము చెప్పనా
సొలసి వూరకే దూరి చూచేవుగాక
వెలయ నీతో నవ్వనా విడెము చేతి కియ్యనా
చలములు పైపై నే సాదించేవుగాక

(॥ఏమో॥)
కొంగువట్టితియ్యనా కూరిములు నించనా
పంగించి యేలో యెగ్గుపట్టేవుగాక
సంగతిగా మొక్కనా సరసములాడనా
జంగిలివేసా లిటు చల్లేవుగాక

(॥ఏమో॥)
బలిమిఁ బైకొననా పట్టి కాఁగిలించనా
అలసితివేమో గోర నంటేవుగాక
అలరి శ్రీవేంకటేశ అట్టే వన్నుఁ గూడితివి
తలపించనా రతిఁ దనయవుగాక

(||pallavi||)
emoyi nannu nerālĕṁcham̐ga dosamugādā
rāmanu nādoḍidela rāvoyi nīvu

(||emo||)
piluvanā māyiṁṭigi priyamu sĕppanā
sŏlasi vūrage dūri sūsevugāga
vĕlaya nīdo navvanā viḍĕmu sedi kiyyanā
salamulu paibai ne sādiṁchevugāga

(||emo||)
kŏṁguvaṭṭidiyyanā kūrimulu niṁchanā
paṁgiṁchi yelo yĕggubaṭṭevugāga
saṁgadigā mŏkkanā sarasamulāḍanā
jaṁgilivesā liḍu sallevugāga

(||emo||)
balimim̐ baigŏnanā paṭṭi kām̐giliṁchanā
alasidivemo gora naṁṭevugāga
alari śhrīveṁkaḍeśha aṭṭe vannum̐ gūḍidivi
talabiṁchanā radim̐ danayavugāga