Emoyi maadone yela goraadigonevu

ఏమోయి మాతోనే యేల గోరాదిగొనేవు
Language

(॥పల్లవి॥)
ఏమోయి మాతోనే యేల గోరాదిగొనేవు
దీమువలె నున్న వారి దీకొనేవు

(॥ఏమో॥)
మాట మఱఁగుసేసుక మౌనముతో నుండితేను
గాఁటమున నన్నేల గర్వమనేవు
కాటుకకన్నుల గాఁగా కడుఁదలవంచుకొంటే
గోటారించి నన్నేల కోపమనేవు

(॥ఏమో॥)
సిగ్గుతెర వేసుకొని చెక్కుచేత నుండితేను
యెగ్గులువట్టితినంటా యేల లోఁచేవు
దగ్గరనోపక నేను తలుపుమాటును నుంటే
బగ్గన లోనికి వచ్చి పైకొనేవు

(॥ఏమో॥)
మానాన మణిఁగి నేను మంచముపై నుండితేను
కానుకగా మోము చూచి కాగిలించేవు
పూని శ్రీవేంకటేశుఁడ పొదిగి నిన్నుఁ గూడితే
సానఁబట్టినగోరేల జళిపించేవు

(||pallavi||)
emoyi mādone yela gorādigŏnevu
dīmuvalĕ nunna vāri dīgŏnevu

(||emo||)
māḍa maṟam̐gusesuga maunamudo nuṁḍidenu
gām̐ṭamuna nannela garvamanevu
kāḍugagannula gām̐gā kaḍum̐dalavaṁchugŏṁṭe
goḍāriṁchi nannela kobamanevu

(||emo||)
siggudĕra vesugŏni sĕkkuseda nuṁḍidenu
yĕgguluvaṭṭidinaṁṭā yela lom̐sevu
daggaranobaga nenu talubumāḍunu nuṁṭe
baggana lonigi vachchi paigŏnevu

(||emo||)
mānāna maṇim̐gi nenu maṁchamubai nuṁḍidenu
kānugagā momu sūsi kāgiliṁchevu
pūni śhrīveṁkaḍeśhum̐ḍa pŏdigi ninnum̐ gūḍide
sānam̐baṭṭinagorela jaḽibiṁchevu