Emoyani vumti mimdaamkaa

ఏమోయని వుంటి మిందాఁకా
Language

(॥పల్లవి॥)
ఏమోయని వుంటి మిందాఁకా
యీ మాటలే కా యిఁక నేలరా

(॥॥)
అందరిఁబొమ్మని యంకెకుఁబిలిచేవు
యిందుకా వోరీ యిందాఁకా
అందుకు మావారి నడిగి వచ్చేఁగాని
పొందుగా దీవేళ పోపోరా

(॥॥)
జఱయచుఁ బిలిపించి సరసములాడేవు
యెఱఁగనైతిదా యిందాఁకా
మఱి జంకించకు కడమా నేఁ జెప్పఁగాని
తఱిగాదు యీవేళ తడవకురా

(॥॥)
చెక్కునొక్కి ననుఁజేకొని కూడితి
యెక్కెరా నీచల మిందాఁకా
చిక్కనినవ్వుల శ్రీ వేంకటేశుఁడ
దక్కితి నిఁక నెందూ దలఁగకురా

(||pallavi||)
emoyani vuṁṭi miṁdām̐kā
yī māḍale kā yim̐ka nelarā

(||||)
aṁdarim̐bŏmmani yaṁkĕgum̐bilisevu
yiṁdugā vorī yiṁdām̐kā
aṁdugu māvāri naḍigi vachchem̐gāni
pŏṁdugā dīveḽa poborā

(||||)
jaṟayasum̐ bilibiṁchi sarasamulāḍevu
yĕṟam̐ganaididā yiṁdām̐kā
maṟi jaṁkiṁchagu kaḍamā nem̐ jĕppam̐gāni
taṟigādu yīveḽa taḍavagurā

(||||)
sĕkkunŏkki nanum̐jegŏni kūḍidi
yĕkkĕrā nīsala miṁdām̐kā
sikkaninavvula śhrī veṁkaḍeśhum̐ḍa
dakkidi nim̐ka nĕṁdū dalam̐gagurā