ఏమొకొ చిగురుటధరమున యెడనెడఁ గస్తురి నిండెను
(॥పల్లవి॥)
ఏమొకొ చిగురుటధరమున యెడనెడఁ గస్తురి నిండెను
భామిని విభుఁనకు వ్రాసిన పత్రిక కాదుగదా
(॥ఏమొ॥)
కలికి చకోరాక్షికిఁ గడకన్నులు గెంపై తోఁచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరె చెలులు
నలువున బ్రాణేశ్వరుపై నాటిన యాకొన చూపులు
నిలువునఁ బెరుకఁగ నంటిన నెత్తురు గాదు గదా
(॥ఏమొ॥)
పడఁతికి చనుఁగవ మెఱుఁగులు పైపై బయ్యెద వెలుపల
కడు మించిన విధమేమో కనుఁగొనరే చెలులు
ఉడుగని వేడుకతోఁ బ్రియుఁడొత్తిన నఖ శశి రేఖలు
వెడలఁగ వేసవికాలపు వెన్నెల గాదు గదా
(॥ఏమొ॥)
ముద్ధియ చెక్కుల కెలఁకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగు లివేమో వూహింపరె చెలులు
గద్దరి తిరువేంకటపతి కామిని వదనాంబుజమున
అద్దిన సురతపుఁ జెమటల అందము గాదు గదా
(||pallavi||)
emŏgŏ siguruḍadharamuna yĕḍanĕḍam̐ gasturi niṁḍĕnu
bhāmini vibhum̐nagu vrāsina patriga kādugadā
(||emŏ||)
kaligi sagorākṣhigim̐ gaḍagannulu gĕṁpai tom̐sina
sĕluvaṁbippuḍidemo siṁtiṁparĕ sĕlulu
naluvuna brāṇeśhvarubai nāḍina yāgŏna sūbulu
niluvunam̐ bĕrugam̐ga naṁṭina nĕtturu gādu gadā
(||emŏ||)
paḍam̐tigi sanum̐gava mĕṟum̐gulu paibai bayyĕda vĕlubala
kaḍu miṁchina vidhamemo kanum̐gŏnare sĕlulu
uḍugani veḍugadom̐ briyum̐ḍŏttina nakha śhaśhi rekhalu
vĕḍalam̐ga vesavigālabu vĕnnĕla gādu gadā
(||emŏ||)
muddhiya sĕkkula kĕlam̐kula mutyabu jallula serbula
vŏddigalāgu livemo vūhiṁparĕ sĕlulu
gaddari tiruveṁkaḍabadi kāmini vadanāṁbujamuna
addina suradabum̐ jĕmaḍala aṁdamu gādu gadā