ఏమో యెరఁగను యెట్టైనాఁ గాని
(॥పల్లవి॥)
ఏమో యెరఁగను యెట్టైనాఁ గాని
వేమరు నీ కెక్కినది వేడుక నా బదుకు
(॥ఏమో॥)
చింత దీర నీ మన్నన చెప్పుకొనఁగా విని
పంతపుసతులు పకపక నవ్వేరు
మంతనానా నీచేఁతలు మరి యే మైనాఁ గలవో
యెంత వలచినది సి గ్గెంచ దంటానో
(॥ఏమో॥)
సమరతి నీ పాన్పుపై సరి నే నుండఁగాఁ జూచి
జమళిఁ దమలోననె సన్న సేసేరు
అమరదో నీవు నేనూ నంటుకొన్నపొందులు
తమితో నాగర్వ మింత తగ దంటానో
(॥ఏమో॥)
చేరి వేడుకొంటా నే నీ చెక్కు నొక్కఁగాఁ జూచి
సారెఁ దమమెకా లిచ్చలఁ జూచేరు
యీరీతి శ్రీవెంకటేశ యిచ్చఁ గూడితిమి మన
నేరుపుల నన్నిటాను నీవె నే నంటానో
(||pallavi||)
emo yĕram̐ganu yĕṭṭainām̐ gāni
vemaru nī kĕkkinadi veḍuga nā badugu
(||emo||)
siṁta dīra nī mannana sĕppugŏnam̐gā vini
paṁtabusadulu pagabaga navveru
maṁtanānā nīsem̐talu mari ye mainām̐ galavo
yĕṁta valasinadi si ggĕṁcha daṁṭāno
(||emo||)
samaradi nī pānpubai sari ne nuṁḍam̐gām̐ jūsi
jamaḽim̐ damalonanĕ sanna seseru
amarado nīvu nenū naṁṭugŏnnabŏṁdulu
tamido nāgarva miṁta taga daṁṭāno
(||emo||)
seri veḍugŏṁṭā ne nī sĕkku nŏkkam̐gām̐ jūsi
sārĕm̐ damamĕgā lichchalam̐ jūseru
yīrīdi śhrīvĕṁkaḍeśha yichcham̐ gūḍidimi mana
nerubula nanniḍānu nīvĕ ne naṁṭāno