Emo seyamgambogaa nemo summee

ఏమో సేయఁగఁబోగా నేమో సుమ్మీ
Language

(॥పల్లవి॥)
ఏమో సేయఁగఁబోగా నేమో సుమ్మీ
మోమెదిరి నందుపై మొక్కులే సుమ్మీ

(॥ఏమో॥)
చిగురుఁగెమ్మోవి వంచేవు చేరి నన్నుఁగని
వొగరుటధరామృతం బొలికీఁ జుమ్మీ
సగము మాఁటాడి గుక్కి జడిసేవు యింతలో
పగటు నీపుక్కిటను పట్ట దది సుమ్మీ

(॥ఏమో॥)
గొబ్బునను గమనించి కొంకేవు నన్నుఁ గని
వుబ్బెల్లఁ జెమటలై వుదిరీఁజుమ్మీ
మబ్బు విడువఁగ నవ్వి మానితివి అంతలోనె
గుబ్బతిల్లి యానవ్వు గుండెవట్టుఁజుమ్మీ

(॥ఏమో॥)
యింపు చేకొనుచు బిగియించేవు కాఁగిటను
ముంపుఁగుచములవాఁడి మొద్దౌఁజుమ్మీ
తెంపున శ్రీవేంకటాద్రిదేవుఁడగనకు నన్ను
సంపదలఁ గూడితివి సరికిసరిసుమ్మీ

(||pallavi||)
emo seyam̐gam̐bogā nemo summī
momĕdiri naṁdubai mŏkkule summī

(||emo||)
sigurum̐gĕmmovi vaṁchevu seri nannum̐gani
vŏgaruḍadharāmṛtaṁ bŏligīm̐ jummī
sagamu mām̐ṭāḍi gukki jaḍisevu yiṁtalo
pagaḍu nībukkiḍanu paṭṭa dadi summī

(||emo||)
gŏbbunanu gamaniṁchi kŏṁkevu nannum̐ gani
vubbĕllam̐ jĕmaḍalai vudirīm̐jummī
mabbu viḍuvam̐ga navvi mānidivi aṁtalonĕ
gubbadilli yānavvu guṁḍĕvaṭṭum̐jummī

(||emo||)
yiṁpu segŏnusu bigiyiṁchevu kām̐giḍanu
muṁpum̐gusamulavām̐ḍi mŏddaum̐jummī
tĕṁpuna śhrīveṁkaḍādridevum̐ḍaganagu nannu
saṁpadalam̐ gūḍidivi sarigisarisummī