Emmelu seyamganele yelumgaaga

ఎమ్మెలు సేయఁగనేలే యేలుఁగాక
Language

(॥పల్లవి॥)
ఎమ్మెలు సేయఁగనేలే యేలుఁగాక
చిమ్ము గోరి తాఁకులేలే చేకొనుఁగాక

(॥ఎమ్మె॥)
కన్నుల నవ్వినవాఁడు కాఁకలతు సేయఁగనేలే
వన్నెతోనే మాయింటికి వచ్చుఁగాక
సన్నలు సేసినవాఁడు చలము సాదించనేలే
మన్నించి నాతోను మాటాడుఁగాక

(॥ఎమ్మె॥)
తప్పక చూచినవాఁడు తనివోని జాగులేలే
కప్పురము నోటికిచ్చి కలయుఁగాక
కొప్పువట్టినట్టివాఁడు గుట్టు సేసుకుండనేలే
కప్పిన పయ్యద దీసి కాఁగిలించుఁగాక

(॥ఎమ్మె॥)
చెలిమి సేసినవాఁడు సిగ్గులు వడఁగనేలే
సొలసి రతుల చవి చూచుఁగాక
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనే నన్నుఁగూడె
వొలసిన మోవితేనె లొసగుఁగాక

(||pallavi||)
ĕmmĕlu seyam̐ganele yelum̐gāga
simmu gori tām̐kulele segŏnum̐gāga

(||ĕmmĕ||)
kannula navvinavām̐ḍu kām̐kaladu seyam̐ganele
vannĕdone māyiṁṭigi vachchum̐gāga
sannalu sesinavām̐ḍu salamu sādiṁchanele
manniṁchi nādonu māḍāḍum̐gāga

(||ĕmmĕ||)
tappaga sūsinavām̐ḍu tanivoni jāgulele
kappuramu noḍigichchi kalayum̐gāga
kŏppuvaṭṭinaṭṭivām̐ḍu guṭṭu sesuguṁḍanele
kappina payyada dīsi kām̐giliṁchum̐gāga

(||ĕmmĕ||)
sĕlimi sesinavām̐ḍu siggulu vaḍam̐ganele
sŏlasi radula savi sūsum̐gāga
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone nannum̐gūḍĕ
vŏlasina movidenĕ lŏsagum̐gāga