ఎమ్మెలు నెరపి యాపె యెంత సేసెనో
(॥పల్లవి॥)
ఎమ్మెలు నెరపి యాపె యెంత సేసెనో
కమ్మర నింతి గుణాలు కంటిఁగా విభుఁడా
(॥ఎమ్మె॥)
తనకే వలతువని తరుణి యాడుకొనఁగ
కొనమాటలకే నిన్నుఁ గోపగించితి
ననిచి యప్పటిఁ గొంతనవ్వేవు నాయెదుటను
నిను భావించఁగలేక నిజమంటా నుంటిని
(॥ఎమ్మె॥)
యేడో ముద్దుటుంగరము ఇచ్చితివని చూపఁగ
అడరాని మాటలెల్లా నాడితి నిన్ను
కూడుక తా మాసరిఁ గూచుండె నావేళ గొంత
యీడుపడి నీఁచేఁత లివియంటా నుంటిని
(॥ఎమ్మె॥)
పిలువ నంపితినని పెద్దరికాలు చెప్పఁగ
చలములెల్లా నిన్ను సాదించితిని
అలరి శ్రీ వేంకటేశ అంతలో నన్నుఁ గూడితి-
వెలమి నాపె చేఁతలు ఇప్పు డెఱిఁగితిని
(||pallavi||)
ĕmmĕlu nĕrabi yābĕ yĕṁta sesĕno
kammara niṁti guṇālu kaṁṭim̐gā vibhum̐ḍā
(||ĕmmĕ||)
tanage valaduvani taruṇi yāḍugŏnam̐ga
kŏnamāḍalage ninnum̐ gobagiṁchidi
nanisi yappaḍim̐ gŏṁtanavvevu nāyĕduḍanu
ninu bhāviṁcham̐galega nijamaṁṭā nuṁṭini
(||ĕmmĕ||)
yeḍo mudduḍuṁgaramu ichchidivani sūbam̐ga
aḍarāni māḍalĕllā nāḍidi ninnu
kūḍuga tā māsarim̐ gūsuṁḍĕ nāveḽa gŏṁta
yīḍubaḍi nīm̐sem̐ta liviyaṁṭā nuṁṭini
(||ĕmmĕ||)
piluva naṁpidinani pĕddarigālu sĕppam̐ga
salamulĕllā ninnu sādiṁchidini
alari śhrī veṁkaḍeśha aṁtalo nannum̐ gūḍidi-
vĕlami nābĕ sem̐talu ippu ḍĕṟim̐gidini