ఎమ్మెలు నేతులు నేఁడు యీకె తోడనా
(॥పల్లవి॥)
ఎమ్మెలు నేతులు నేఁడు యీకె తోడనా
యిమ్ముల నీ సుద్దులు నే మెఱఁగనివా
(॥॥)
ముచ్చటైన గుట్టుతోడి ముదితను ఇంతేసి-
పచ్చిదేర నవ్వేవు పంతమా నీకు
అచ్చలాన సిగ్గువడేయాఁటదానితో నింత-
పెచ్చువెరిగేది నీకుఁ బెద్దరికమా
(॥॥)
సాదుఁదనాన నిల్లాలై సంగడినే వుండఁగాను
వీదిలోనఁ జెనకేవు వేడుకా యిది
ఆదరించి ఇచ్చకములాడేదానితో నింత-
తోదోపులాడేది దోరతనమా
(॥॥)
వొడికాననుండేటి వువిదపయ్యద దీసి
కడుఁ జన్ను లంటేవు గర్వమా నీకు
అడరి శ్రీ వేంకటేశ అలమేలుమంగఁ గూడి
జడిగొని మెచ్చేదే జాణతనమా
(||pallavi||)
ĕmmĕlu nedulu nem̐ḍu yīgĕ toḍanā
yimmula nī suddulu ne mĕṟam̐ganivā
(||||)
muchchaḍaina guṭṭudoḍi mudidanu iṁtesi-
pachchidera navvevu paṁtamā nīgu
achchalāna sigguvaḍeyām̐ṭadānido niṁta-
pĕchchuvĕrigedi nīgum̐ bĕddarigamā
(||||)
sādum̐danāna nillālai saṁgaḍine vuṁḍam̐gānu
vīdilonam̐ jĕnagevu veḍugā yidi
ādariṁchi ichchagamulāḍedānido niṁta-
todobulāḍedi doradanamā
(||||)
vŏḍigānanuṁḍeḍi vuvidabayyada dīsi
kaḍum̐ jannu laṁṭevu garvamā nīgu
aḍari śhrī veṁkaḍeśha alamelumaṁgam̐ gūḍi
jaḍigŏni mĕchchede jāṇadanamā