Emmelu maa mumdara nee vemta soobeve

ఎమ్మెలు మా ముందర నీ వెంత చూపేవే
Language

(॥పల్లవి॥)
ఎమ్మెలు మా ముందర నీ వెంత చూపేవే
బొమ్మల జింకించి రతిఁ బొదిగేవు నీవు

(॥॥)
చనవరి వౌదువే సరిఁ బతిబుజముపైఁ
నొనరఁగఁ జెయివేసుకుందానవు
ననుపు గలదె నీకు నంటున నీతని నిట్టె
కొనగోరఁ జెనుకుచుఁ గొసరేవు నీవు

(॥॥)
చుట్టమ వౌదువె కాంతుఁ జొక్కించి మెడసంది నీఁ
వొట్టుక గడ్డ మానించుకుందానవు
జట్టిగొంటివె యీతనిజంటఁ బాదము పాదాన
మెట్టి బలిమి చూపుచు మేలములాడేవు

(॥॥)
దేవులవౌదువె నీవు తెప్పలఁ దేలఁగఁ గూడి
శ్రీ వేంకటేశుపొత్తునఁ జెలరేగేవు
తావు కొంటివే నేఁడితని నన్నుఁ బెండ్లి సేసి
వేవేలువేడుకలతో వినోదాలాడేవు

(||pallavi||)
ĕmmĕlu mā muṁdara nī vĕṁta sūbeve
bŏmmala jiṁkiṁchi radim̐ bŏdigevu nīvu

(||||)
sanavari vauduve sarim̐ badibujamubaim̐
nŏnaram̐gam̐ jĕyivesuguṁdānavu
nanubu galadĕ nīgu naṁṭuna nīdani niṭṭĕ
kŏnagoram̐ jĕnugusum̐ gŏsarevu nīvu

(||||)
suṭṭama vauduvĕ kāṁtum̐ jŏkkiṁchi mĕḍasaṁdi nīm̐
vŏṭṭuga gaḍḍa māniṁchuguṁdānavu
jaṭṭigŏṁṭivĕ yīdanijaṁṭam̐ bādamu pādāna
mĕṭṭi balimi sūbusu melamulāḍevu

(||||)
devulavauduvĕ nīvu tĕppalam̐ delam̐gam̐ gūḍi
śhrī veṁkaḍeśhubŏttunam̐ jĕlaregevu
tāvu kŏṁṭive nem̐ḍidani nannum̐ bĕṁḍli sesi
veveluveḍugalado vinodālāḍevu