Emmelinniyunum jesi yela lomgevu

ఎమ్మెలిన్నియునుఁ జేసి యేల లోఁగేవు
Language

(॥పల్లవి॥)
ఎమ్మెలిన్నియునుఁ జేసి యేల లోఁగేవు
సమ్మతించఁ జేసి యట్టె జట్టి గొనరాదా

(॥ఎమ్మె॥)
కాటుకకన్నులనాపె కాఁకలఁ గోపించెనంటా
యేఁటికి నీవు వెరచే వీడనుండే
ఆఁటదానికోపమెంత ఆయమెంత నీవు చేరి
నాఁటిన మాటలాడి నవ్వు నవ్వరాదా

(॥ఎమ్మె॥)
తప్పు నీపై వేసి యాపె తల వంచుకొనెనంటా
వొప్పుగ నీవు మోనాన నుస్సురనేవు
యిప్పుడాపె చలమెంత యియ్యకొలిపేదెంత
కొప్పు దువ్వి గుబ్బలపై కొనగోరు మోఁపరాదా

(॥ఎమ్మె॥)
మంతనాననాపె నీతో మంకులు నెరపెనంటా
చింతతోడ నీకు నీకే సిగ్గు వడేవు
యింతలోనె శ్రీవేంకటేశ యీపెఁ గూడితివి
పంతములెల్లా నెరపె పచ్చి సేయరాదా

(||pallavi||)
ĕmmĕlinniyunum̐ jesi yela lom̐gevu
sammadiṁcham̐ jesi yaṭṭĕ jaṭṭi gŏnarādā

(||ĕmmĕ||)
kāḍugagannulanābĕ kām̐kalam̐ gobiṁchĕnaṁṭā
yem̐ṭigi nīvu vĕrase vīḍanuṁḍe
ām̐ṭadānigobamĕṁta āyamĕṁta nīvu seri
nām̐ṭina māḍalāḍi navvu navvarādā

(||ĕmmĕ||)
tappu nībai vesi yābĕ tala vaṁchugŏnĕnaṁṭā
vŏppuga nīvu monāna nussuranevu
yippuḍābĕ salamĕṁta yiyyagŏlibedĕṁta
kŏppu duvvi gubbalabai kŏnagoru mom̐parādā

(||ĕmmĕ||)
maṁtanānanābĕ nīdo maṁkulu nĕrabĕnaṁṭā
siṁtadoḍa nīgu nīge siggu vaḍevu
yiṁtalonĕ śhrīveṁkaḍeśha yībĕm̐ gūḍidivi
paṁtamulĕllā nĕrabĕ pachchi seyarādā