ఎమ్మెల నాలిమగని కిద్దరికిఁ దగునయ్య
(॥పల్లవి॥)
ఎమ్మెల నాలిమగని కిద్దరికిఁ దగునయ్య
మమ్ముబోంట్ల నన్నిటా మన్నించుఁడీ అయ్యా
(॥ఎమ్మె॥)
చేకొని మీరిద్దరు నా చేత మాటఁబడితిరి
ఆకెయు మీరు బదుకుఁడయ్యా యింక
నాకన్నుల జంకెలకు నవ్వులేల నవ్వితిరి
మీకెవ్వరు యిట్టె సరి మేలు గానిమ్మయ్యా
(॥ఎమ్మె॥)
మంతనాన నుండి మీరు మచ్చిక నేఁ జూచితేను
పంతమిచ్చితిరి యిట్టె బదుకుఁడయ్యా
బంతి నేఁ గొసరితేను బాగాలు నా కిచ్చితిరి
సంతోసాలు మీ కెప్పుడు సరి గానిండయ్యా
(॥ఎమ్మె॥)
ఇల నాకుఁ జనవిచ్చి ఇద్దరు నాచెప్పినట్టు
పలుమారుఁ జేసితిరి బదుకుఁడయ్యా
అలమేలుమంగవు నీ వాతఁడు శ్రీవేంకటేశుఁ
డెలమి నన్ను మెచ్చితి రిద్ద రీడేరుఁడయ్యా
(||pallavi||)
ĕmmĕla nālimagani kiddarigim̐ dagunayya
mammuboṁṭla nanniḍā manniṁchum̐ḍī ayyā
(||ĕmmĕ||)
segŏni mīriddaru nā seda māḍam̐baḍidiri
āgĕyu mīru badugum̐ḍayyā yiṁka
nāgannula jaṁkĕlagu navvulela navvidiri
mīgĕvvaru yiṭṭĕ sari melu gānimmayyā
(||ĕmmĕ||)
maṁtanāna nuṁḍi mīru machchiga nem̐ jūsidenu
paṁtamichchidiri yiṭṭĕ badugum̐ḍayyā
baṁti nem̐ gŏsaridenu bāgālu nā kichchidiri
saṁtosālu mī kĕppuḍu sari gāniṁḍayyā
(||ĕmmĕ||)
ila nāgum̐ janavichchi iddaru nāsĕppinaṭṭu
palumārum̐ jesidiri badugum̐ḍayyā
alamelumaṁgavu nī vādam̐ḍu śhrīveṁkaḍeśhum̐
ḍĕlami nannu mĕchchidi ridda rīḍerum̐ḍayyā