(॥పల్లవి॥)
ఎమ్మెకాఁడు గదె యీదేవుఁడు
కుమ్మరించీ మేలు గోవిందరాజు
(॥॥)
గొల్లెత లిందరు కొలువు సేయఁగ
నల్లదె సరసమాడుచును
తెల్లని కన్నుల తేట చూపులతో
కొల్లున నవ్వీని గోవిందరాజు
(॥॥)
పడఁతు లిద్దరు పాదా లొత్తఁగాను
అడరి కుచుము లంటుచును
వెడగుమాటలు వేవే లాడుతాను
కొడుకుఁ గనెను గోవిందరాజు
(॥॥)
వూడిగపువారు వొద్దనే వుండఁగ
జూడువలపులు చల్లుచును
వేడుకతో శ్రీవేంకటాద్రిమీఁదఁ
గూడీ నిందరిని గోవిందరాజు
(||pallavi||)
ĕmmĕgām̐ḍu gadĕ yīdevum̐ḍu
kummariṁchī melu goviṁdarāju
(||||)
gŏllĕda liṁdaru kŏluvu seyam̐ga
nalladĕ sarasamāḍusunu
tĕllani kannula teḍa sūbulado
kŏlluna navvīni goviṁdarāju
(||||)
paḍam̐tu liddaru pādā lŏttam̐gānu
aḍari kusumu laṁṭusunu
vĕḍagumāḍalu veve lāḍudānu
kŏḍugum̐ ganĕnu goviṁdarāju
(||||)
vūḍigabuvāru vŏddane vuṁḍam̐ga
jūḍuvalabulu sallusunu
veḍugado śhrīveṁkaḍādrimīm̐dam̐
gūḍī niṁdarini goviṁdarāju