Emmegaamdavai tiruga nimta dora kemtigi

ఎమ్మెకాఁడవై తిరుగ నింత దొర కేఁటికి
Language

(॥పల్లవి॥)
ఎమ్మెకాఁడవై తిరుగ నింత దొర కేఁటికి
దిమ్మరిమాటల నాచేఁ దిట్టించుకోవలెనా

(॥ఎమ్మె॥)
వూరకున్న నన్నుఁ దెచ్చి వోరి నీవు వలచిన
వూరసతులఁ జూపి న న్నుడికించేవు
మేరతో నీ కితవైతే మెడఁ గట్టుకొందు గాక
వారి నన్ను సరిచేసి వాదువెట్టవలెనా

(॥ఎమ్మె॥)
దవ్వులఁ గూచున్న నన్నుఁ దలఁపించి వారిచేత
యెవ్వతెంటా నడిగించి యీసు రేఁచేవు
యెవ్వతె మన్నించినా నీ వేమైనా నిత్తువు గాక
రవ్వగాని యాఁడువారి రాఁపుసేయవలెనా

(॥ఎమ్మె॥)
తతి నిన్ను నేఁ గూడి తనిసితే నీ తోటి
సతులచే మొక్కించి జంట సేసేవు
సతమై శ్రీవేంకటేశ సవతులయినవారిఁ
బతివెట్టవలెఁ గాక పచ్చి సేయవలెనా

(||pallavi||)
ĕmmĕgām̐ḍavai tiruga niṁta dŏra kem̐ṭigi
dimmarimāḍala nāsem̐ diṭṭiṁchugovalĕnā

(||ĕmmĕ||)
vūragunna nannum̐ dĕchchi vori nīvu valasina
vūrasadulam̐ jūbi na nnuḍigiṁchevu
merado nī kidavaide mĕḍam̐ gaṭṭugŏṁdu gāga
vāri nannu sarisesi vāduvĕṭṭavalĕnā

(||ĕmmĕ||)
davvulam̐ gūsunna nannum̐ dalam̐piṁchi vāriseda
yĕvvadĕṁṭā naḍigiṁchi yīsu rem̐sevu
yĕvvadĕ manniṁchinā nī vemainā nittuvu gāga
ravvagāni yām̐ḍuvāri rām̐puseyavalĕnā

(||ĕmmĕ||)
tadi ninnu nem̐ gūḍi taniside nī toḍi
sadulase mŏkkiṁchi jaṁṭa sesevu
sadamai śhrīveṁkaḍeśha savadulayinavārim̐
badivĕṭṭavalĕm̐ gāga pachchi seyavalĕnā