Emkareeni mimmum joosi idevvaroyi

ఏఁకరీని మిమ్ముఁ జూచి ఇదెవ్వరోయి
Language

(॥పల్లవి॥)
ఏఁకరీని మిమ్ముఁ జూచి ఇదెవ్వరోయి
తాఁకించీఁ దనచన్నులఁ దా నెవ్వరోయి

(॥॥)
దేవులు నీవును నిట్టే తెరవేసుకుండఁగాను
యీవల తోంగి చూచీని ఇదెవ్వరోయి
వూవులదండలు మీరు పూఁచి వేసుకోఁగాను
తావి మూరుకొనవచ్చీఁ దా నెవ్వరోయి

(॥॥)
చెప్పరాని మాటలెల్లా చేరి మీరాడుకొనఁగా
యిప్పుడే పొంచులు వినీ నిదెవ్వరోయి
విప్పుచు సురటి మీరు వేమారు విసరుకోఁ గా
దప్పిదేరీ నడుమను తా నెవ్వరొయి

(॥॥)
కలసి మీరిద్దరును కాఁగిటనే కూడఁగాను
యెలుఁ గెత్తి పాటవాడీ నిదెవ్వరోయి
అలరి శ్రీ వేంకటేశ అట్టె నన్ను నేలితివి
తలఁపించీ రతులెల్లాఁ దా నెవ్వరోయి

(||pallavi||)
em̐karīni mimmum̐ jūsi idĕvvaroyi
tām̐kiṁchīm̐ danasannulam̐ dā nĕvvaroyi

(||||)
devulu nīvunu niṭṭe tĕravesuguṁḍam̐gānu
yīvala toṁgi sūsīni idĕvvaroyi
vūvuladaṁḍalu mīru pūm̐si vesugom̐gānu
tāvi mūrugŏnavachchīm̐ dā nĕvvaroyi

(||||)
sĕpparāni māḍalĕllā seri mīrāḍugŏnam̐gā
yippuḍe pŏṁchulu vinī nidĕvvaroyi
vippusu suraḍi mīru vemāru visarugom̐ gā
dappiderī naḍumanu tā nĕvvarŏyi

(||||)
kalasi mīriddarunu kām̐giḍane kūḍam̐gānu
yĕlum̐ gĕtti pāḍavāḍī nidĕvvaroyi
alari śhrī veṁkaḍeśha aṭṭĕ nannu nelidivi
talam̐piṁchī radulĕllām̐ dā nĕvvaroyi