Emkaree nappada numdi idivo neegu

ఏఁకరీ నప్పట నుండి ఇదివో నీకు
Language

(॥పల్లవి॥)
ఏఁకరీ నప్పట నుండి ఇదివో నీకు
ఆఁక వలపులు చల్లీ నడుగరాదా

(॥ఏఁక॥)
నిన్నుఁ జూచి సారెసారె నెలఁత
కన్నచోటనెల్లా నిచ్చకము సేసీని
చన్నుల నొరసుక నీ సంగడి నుండీ
తిన్నఁగా నాపె తలఁపు దెలుసుకోరాదా

(॥ఏఁక॥)
మొగమెత్తి కనుఁగొంటే మొక్కుమొక్కీని
తగిలి తగిలి యాకతము లాడీని
నగీ నంతలోనె నిన్ను నంటుసేసుక
సొగిసి యాపె గుట్టు సోదించరాదా

(॥ఏఁక॥)
వావి నీతోఁ జెప్పవచ్చీ వక్కణగాను
యేవేళాఁ గొలువుసేసీ యెదుటనుండి
శ్రీవేంకటేశుఁడు నన్నుఁ జిత్తగించి కూడితివి
కావించి యాపె చుట్టరికమూఁ జేయరాదా

(||pallavi||)
em̐karī nappaḍa nuṁḍi idivo nīgu
ām̐ka valabulu sallī naḍugarādā

(||em̐ka||)
ninnum̐ jūsi sārĕsārĕ nĕlam̐ta
kannasoḍanĕllā nichchagamu sesīni
sannula nŏrasuga nī saṁgaḍi nuṁḍī
tinnam̐gā nābĕ talam̐pu dĕlusugorādā

(||em̐ka||)
mŏgamĕtti kanum̐gŏṁṭe mŏkkumŏkkīni
tagili tagili yāgadamu lāḍīni
nagī naṁtalonĕ ninnu naṁṭusesuga
sŏgisi yābĕ guṭṭu sodiṁcharādā

(||em̐ka||)
vāvi nīdom̐ jĕppavachchī vakkaṇagānu
yeveḽām̐ gŏluvusesī yĕduḍanuṁḍi
śhrīveṁkaḍeśhum̐ḍu nannum̐ jittagiṁchi kūḍidivi
kāviṁchi yābĕ suṭṭarigamūm̐ jeyarādā