ఏఁకారే యాపె నేల యేఁచేవు నీవు
(॥పల్లవి॥)
ఏఁకారే యాపె నేల యేఁచేవు నీవు
వాఁకపు వలపులెల్లా వంచీని నీకు
(॥ఏఁకా॥)
పయ్యదలోపలి గుబ్బపాలిండ్లు దనివార
నెయ్యపుఁ జెలిఁ గాఁగిట నించఁగరాదా
వుయ్యాల మంచముమీఁద వొద్దనే కూచున్నది
చెయ్యరాదా చేఁతలు చెక్కులనిండాను
(॥ఏఁకా॥)
ముసిముసి నవ్వుల మోమునిండా జొబ్బిల
కొసరు నీమోవితేనె కులుకరాదా
పసలుగా నీకు నిట్టే పాదాలొత్తుచున్నది
పొసఁగరాదా రతుల పొందులకొలఁదిని
(॥ఏఁకా॥)
మదములు దొలఁకేటి మర్మములు సోఁకఁగ
మదిమదిఁ గూడితివి మన్నించరాదా
వుదుటై శ్రీవేంకటేశ వురముపై నున్నది
పొదుగరాదా నేర్పుల పూఁచినటువలెను
(||pallavi||)
em̐kāre yābĕ nela yem̐sevu nīvu
vām̐kabu valabulĕllā vaṁchīni nīgu
(||em̐kā||)
payyadalobali gubbabāliṁḍlu danivāra
nĕyyabum̐ jĕlim̐ gām̐giḍa niṁcham̐garādā
vuyyāla maṁchamumīm̐da vŏddane kūsunnadi
sĕyyarādā sem̐talu sĕkkulaniṁḍānu
(||em̐kā||)
musimusi navvula momuniṁḍā jŏbbila
kŏsaru nīmovidenĕ kulugarādā
pasalugā nīgu niṭṭe pādālŏttusunnadi
pŏsam̐garādā radula pŏṁdulagŏlam̐dini
(||em̐kā||)
madamulu dŏlam̐keḍi marmamulu som̐kam̐ga
madimadim̐ gūḍidivi manniṁcharādā
vuduḍai śhrīveṁkaḍeśha vuramubai nunnadi
pŏdugarādā nerbula pūm̐sinaḍuvalĕnu