Emiyum goluba vimka nemti maadaaloo

ఏమియుఁ గొలుప వింక నేఁటి మాటాలూ
Language

(॥పల్లవి॥)
ఏమియుఁ గొలుప వింక నేఁటి మాటాలూ
యీ మన సెల్లఁ గంటిమి యిఁక నేటి మాటలు

(॥ఏమియు॥)
వున్నతి నీ హరములు వొకతెమెడ నుండఁగ
నెన్నుకొంటి విందాఁక నేటి మాటలు
నిన్ను సతు లెల్లాను నేరము లెంచే దెల్లా
నిన్నిటాను సరి వచ్చె నిఁక నేటి మాటలు

(॥ఏమియు॥)
మేలిమి వింతవాసన మేన నీవు నించుకొని
యేల న న్నొడఁబరచే వేఁటి మాఁటలు
పాలించి యాపెకు నీవు బాస లెల్ల నిచ్చి వచ్చి
యీలీల ముచ్చట లాడే విఁక నేఁటి మాఁటలు

(॥ఏమియు॥)
నవ్వుతా నొకతెతోడ నంటు సేసితి విందాఁక
యివ్వల నన్నుఁ బిలిచే వేఁటి మాటలు
రవ్వగా శ్రీవెంకటేశ రతి నన్నుఁ గూడితివి
యెవ్వతెతోడుత నీకు నిఁక నేఁటి మాటలు

(||pallavi||)
emiyum̐ gŏluba viṁka nem̐ṭi māḍālū
yī mana sĕllam̐ gaṁṭimi yim̐ka neḍi māḍalu

(||emiyu||)
vunnadi nī haramulu vŏgadĕmĕḍa nuṁḍam̐ga
nĕnnugŏṁṭi viṁdām̐ka neḍi māḍalu
ninnu sadu lĕllānu neramu lĕṁche dĕllā
ninniḍānu sari vachchĕ nim̐ka neḍi māḍalu

(||emiyu||)
melimi viṁtavāsana mena nīvu niṁchugŏni
yela na nnŏḍam̐barase vem̐ṭi mām̐ṭalu
pāliṁchi yābĕgu nīvu bāsa lĕlla nichchi vachchi
yīlīla muchchaḍa lāḍe vim̐ka nem̐ṭi mām̐ṭalu

(||emiyu||)
navvudā nŏgadĕdoḍa naṁṭu sesidi viṁdām̐ka
yivvala nannum̐ bilise vem̐ṭi māḍalu
ravvagā śhrīvĕṁkaḍeśha radi nannum̐ gūḍidivi
yĕvvadĕdoḍuda nīgu nim̐ka nem̐ṭi māḍalu