ఏమిసేయవచ్చు నిక నెరిఁగిన పనులకు
(॥పల్లవి॥)
ఏమిసేయవచ్చు నిక నెరిఁగిన పనులకు
నా మనసు నమ్మికగా నడవుమీ యిఁకను
(॥॥)
మగువతో నిందాఁగా మాఁటలాడి మాఁటలాడి
నగేవు యింతటిలోనే నాదిక్కు చూచి
వొగి మొదల నేనీడ వుండుట తెలియవద్దా
పగటు నీగుట్టెల్లా పచ్చిదేరె నిపుడు
(॥॥)
చెలి నీవు నేడాలేనిచేఁతలెల్లా జేసుకొని
తలఁకే వింటిలో నన్నుఁ దలఁచుకొని
యెలమి నామెలఁకువ యింతుల నడుగవద్దా
కలిగిననీగుణాలు కానవచ్చె నిపుడు
(॥॥)
కాంతఁ గూడి తెరదండఁ గాచుకున్ననన్ను ముట్టి
చెంతఁ గాఁగిలించితివి శ్రీ వేంకటేశ
వింతలుగా నావునికి విచారించుకోవద్దా
సంతమై నీనేర్పులెల్లా సరివచ్చె నిపుడు
(||pallavi||)
emiseyavachchu niga nĕrim̐gina panulagu
nā manasu nammigagā naḍavumī yim̐kanu
(||||)
maguvado niṁdām̐gā mām̐ṭalāḍi mām̐ṭalāḍi
nagevu yiṁtaḍilone nādikku sūsi
vŏgi mŏdala nenīḍa vuṁḍuḍa tĕliyavaddā
pagaḍu nīguṭṭĕllā pachchiderĕ nibuḍu
(||||)
sĕli nīvu neḍālenisem̐talĕllā jesugŏni
talam̐ke viṁṭilo nannum̐ dalam̐sugŏni
yĕlami nāmĕlam̐kuva yiṁtula naḍugavaddā
kaliginanīguṇālu kānavachchĕ nibuḍu
(||||)
kāṁtam̐ gūḍi tĕradaṁḍam̐ gāsugunnanannu muṭṭi
sĕṁtam̐ gām̐giliṁchidivi śhrī veṁkaḍeśha
viṁtalugā nāvunigi visāriṁchugovaddā
saṁtamai nīnerbulĕllā sarivachchĕ nibuḍu