Emisesinaam jesidi vinnidaa neeveligavu

ఏమిచేసినాఁ జేసితి విన్నిటా నీవేలికవు
Language

(॥పల్లవి॥)
ఏమిచేసినాఁ జేసితి విన్నిటా నీవేలికవు
నేమము మీరి తిట్టఁగ నీతియౌనా నాకు

(॥ఏమి॥)
కొలవులో నాపెను కొంగువట్టితివంటాను
చలము సాదింతునా సారెసారకు
మలసి నే జూడఁగానే మర్మములంటితివంటా
అలుగవచ్చునా నీతో అలనైనా నాకు

(॥ఏమి॥)
చన్నులంటి యప్పటిని సరసమాడితివంటా
చెన్నుమిర నిటు రట్టు సేతునా నేను
సన్నలుసేసి మోవి చవులుచూపితివంటా
నిన్నును జంకించ నిఁక నేరుపౌనా నాకు

(॥ఏమి॥)
గక్కుననుఁ దెరవేసి కాఁగిలించుకొంటివంటా
వెక్కసమాడుదునా శ్రీవేంకటేశుఁడా
అక్కర నలమేల్మంగనయిన నన్నుఁ గూడితివి
దక్కితి వికఁ గొసరఁ దగవౌనా నాకు

(||pallavi||)
emisesinām̐ jesidi vinniḍā nīveligavu
nemamu mīri tiṭṭam̐ga nīdiyaunā nāgu

(||emi||)
kŏlavulo nābĕnu kŏṁguvaṭṭidivaṁṭānu
salamu sādiṁtunā sārĕsāragu
malasi ne jūḍam̐gāne marmamulaṁṭidivaṁṭā
alugavachchunā nīdo alanainā nāgu

(||emi||)
sannulaṁṭi yappaḍini sarasamāḍidivaṁṭā
sĕnnumira niḍu raṭṭu sedunā nenu
sannalusesi movi savulusūbidivaṁṭā
ninnunu jaṁkiṁcha nim̐ka nerubaunā nāgu

(||emi||)
gakkunanum̐ dĕravesi kām̐giliṁchugŏṁṭivaṁṭā
vĕkkasamāḍudunā śhrīveṁkaḍeśhum̐ḍā
akkara nalamelmaṁganayina nannum̐ gūḍidivi
dakkidi vigam̐ gŏsaram̐ dagavaunā nāgu