Emisesinaam jese neladoorere yadani

ఏమిచేసినాఁ జేసె నేలదూరేరే యతని
Language

(॥పల్లవి॥)
ఏమిచేసినాఁ జేసె నేలదూరేరే యతని
ఆముకొన వలచితి నాతఁ డేమి సేసునే

(॥ఏమి॥)
కన్నులఁ బతిఁ జూచితేఁ గాయమెల్లాఁ బులకించే
చన్నుల నోత్తితి నింతే జాజుకోనఁ బులకించే
సన్నల నవ్వితి నింతే జడిచెమటలు నిండె
అన్నిటా నానేర మింతే నాతఁ డేమి సేసునే

(॥ఏమి॥)
సుద్దులు నే వింటి నింతే చురుకనె నాయములు
వొద్దికి వచ్చితే నింతే వుల్లమెల్ల మఱపాయ
గద్దించి మాటాడఁ బోతేఁ గడు మోవిఁ దేనె చిందె
అద్దొ నానేర మింతే అతఁ డేమిసేసునే

(॥ఏమి॥)
కాఁగిలించఁబొతి నింతే కళలెల్లాఁ జిమ్మిరేఁగె
తోఁగి సిగ్గువడఁబోతే తొలఁగెఁ బయ్యదకొంగు
పాఁగిన శ్రీవేంకటాదిపతి దానె నన్నుఁ గూడె
ఆఁగిన నారతి ఇంతే నతఁ డేమి సేసునే

(||pallavi||)
emisesinām̐ jesĕ neladūrere yadani
āmugŏna valasidi nādam̐ ḍemi sesune

(||emi||)
kannulam̐ badim̐ jūsidem̐ gāyamĕllām̐ bulagiṁche
sannula nottidi niṁte jājugonam̐ bulagiṁche
sannala navvidi niṁte jaḍisĕmaḍalu niṁḍĕ
anniḍā nānera miṁte nādam̐ ḍemi sesune

(||emi||)
suddulu ne viṁṭi niṁte suruganĕ nāyamulu
vŏddigi vachchide niṁte vullamĕlla maṟabāya
gaddiṁchi māḍāḍam̐ bodem̐ gaḍu movim̐ denĕ siṁdĕ
addŏ nānera miṁte adam̐ ḍemisesune

(||emi||)
kām̐giliṁcham̐bŏdi niṁte kaḽalĕllām̐ jimmirem̐gĕ
tom̐gi sigguvaḍam̐bode tŏlam̐gĕm̐ bayyadagŏṁgu
pām̐gina śhrīveṁkaḍādibadi dānĕ nannum̐ gūḍĕ
ām̐gina nāradi iṁte nadam̐ ḍemi sesune