Emisesinaam jellu neegaalamu

ఏమిచేసినాఁ జెల్లు నీకాలము
Language

(॥పల్లవి॥)
ఏమిచేసినాఁ జెల్లు నీకాలము
నాములు వార సెలవి నవ్వు నవ్వవే

(॥ఏమి॥)
సందడిలోపల నీవు సన్నచేసేవు పతికి
కుందనేల నీవూ నండఁ గూచుండవే
యెందరికైనా నోపు నితఁడు నీకోపఁడా
విందువలె చేతికి నీ విడెమియ్యవే

(॥ఏమి॥)
పొలసి యెచ్చరికెగా పూవుల వేసేవాతని
చలపట్టి నీవు సరసములాడవే
నెలకొన్నాసోదకాఁడు నిన్ను మానీనా యాతఁడు
కలికితనాల నట్టే కాఁగిలించవే

(॥ఏమి॥)
కమ్మటిఁ గమ్మటి వచ్చి కానుకిచ్చే వితనికి
వుమ్మడినీ చన్నులను వొరయఁగదే
యెమ్మె నితఁడే శ్రీవేంకటేశుఁడు నన్నూ నిన్నేలె
సమ్మతించి మోవి యట్టే చవిగొనవే

(||pallavi||)
emisesinām̐ jĕllu nīgālamu
nāmulu vāra sĕlavi navvu navvave

(||emi||)
saṁdaḍilobala nīvu sannasesevu padigi
kuṁdanela nīvū naṁḍam̐ gūsuṁḍave
yĕṁdarigainā nobu nidam̐ḍu nīgobam̐ḍā
viṁduvalĕ sedigi nī viḍĕmiyyave

(||emi||)
pŏlasi yĕchcharigĕgā pūvula vesevādani
salabaṭṭi nīvu sarasamulāḍave
nĕlagŏnnāsodagām̐ḍu ninnu mānīnā yādam̐ḍu
kaligidanāla naṭṭe kām̐giliṁchave

(||emi||)
kammaḍim̐ gammaḍi vachchi kānugichche vidanigi
vummaḍinī sannulanu vŏrayam̐gade
yĕmmĕ nidam̐ḍe śhrīveṁkaḍeśhum̐ḍu nannū ninnelĕ
sammadiṁchi movi yaṭṭe savigŏnave