Emiseppedi nee yaasa yamtagainaa nobuduvu

ఏమిచెప్పేది నీ యాస యంతకైనా నోపుదువు
Language

(॥పల్లవి॥)
ఏమిచెప్పేది నీ యాస యంతకైనా నోపుదువు
ఆముకొన్న నిన్నుఁ జూచి అరుదయ్యీ నాకును

(॥ఏమి॥)
సెలవిన వ్వొకతెతో చేసన్న లొకతెతో
యెలమిఁ జేసేవు వలపెందు నున్నది
కొలువు చేసేసతులు కోటానఁగోట్లు
అలరి యెవ్వరి వాఁడ వానతియ్యవయ్యా

(॥ఏమి॥)
శిర సొక్కతెతొడపై జిగిఁబాదా లొక్కతెపై
ఇరవాయ, నీమనసు యేడనున్నది
యిరుమేలా నూడిగపుటింతులు సేనాసేన
యెరవులేక యిందరి నెట్టు మన్నింతువయ్యా

(॥ఏమి॥)
వొక్కతెఁ గాఁగిటఁగూడి వొక్కతె మోవి యానేవు
ఇక్కువై నీభావ మెట్లున్నది
ఇక్కడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నిక్కము నిఁ(ని:?) తేసి యెట్టు నేర్చుకొంటివయ్యా

(||pallavi||)
emisĕppedi nī yāsa yaṁtagainā nobuduvu
āmugŏnna ninnum̐ jūsi arudayyī nāgunu

(||emi||)
sĕlavina vvŏgadĕdo sesanna lŏgadĕdo
yĕlamim̐ jesevu valabĕṁdu nunnadi
kŏluvu sesesadulu koḍānam̐goṭlu
alari yĕvvari vām̐ḍa vānadiyyavayyā

(||emi||)
śhira sŏkkadĕdŏḍabai jigim̐bādā lŏkkadĕbai
iravāya, nīmanasu yeḍanunnadi
yirumelā nūḍigabuḍiṁtulu senāsena
yĕravulega yiṁdari nĕṭṭu manniṁtuvayyā

(||emi||)
vŏkkadĕm̐ gām̐giḍam̐gūḍi vŏkkadĕ movi yānevu
ikkuvai nībhāva mĕṭlunnadi
ikkaḍa śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
nikkamu nim̐(ni:?) tesi yĕṭṭu nersugŏṁṭivayyā