ఏమిచెప్పే వాకె సుద్ది యేరా నాతోను
(॥పల్లవి॥)
ఏమిచెప్పే వాకె సుద్ది యేరా నాతోను
నేమము గలదియైతే నిండుకొని యుండును
(॥ఏమి॥)
యెమ్మెలు చెప్పుకొనేది యెందైనా నొకతెగాని
వుమ్మడి నిల్లాలైతే నూరకుండును
నమ్మిక బాసడిగేది నడుమంత్రపుదిగాని
ఇమ్ముల మేనదియైతే నెదురాడకుందును
(॥ఏమి॥)
కోపగించు కొనియేది కోటికి నొకతెగాని
కాఁపురము సేసేదైతే కాఁగకుండును
ఆపసోపానఁబడేది ఆరడికత్తియఁగాని
వోపి బత్తి గలదైతే వొద్దికతో నుండును
(॥ఏమి॥)
కావరించి తిట్టేది గయ్యాళి యొకతెగాని
వావివర్తనదియైతే వచ్చి మొక్కును
శ్రీవేంకటేశ నన్నుఁ జేరి కూడితివి నేఁడు
దేవులైనది యైతేను దీని కిట్టె మెచ్చును
(||pallavi||)
emisĕppe vāgĕ suddi yerā nādonu
nemamu galadiyaide niṁḍugŏni yuṁḍunu
(||emi||)
yĕmmĕlu sĕppugŏnedi yĕṁdainā nŏgadĕgāni
vummaḍi nillālaide nūraguṁḍunu
nammiga bāsaḍigedi naḍumaṁtrabudigāni
immula menadiyaide nĕdurāḍaguṁdunu
(||emi||)
kobagiṁchu kŏniyedi koḍigi nŏgadĕgāni
kām̐puramu sesedaide kām̐gaguṁḍunu
ābasobānam̐baḍedi āraḍigattiyam̐gāni
vobi batti galadaide vŏddigado nuṁḍunu
(||emi||)
kāvariṁchi tiṭṭedi gayyāḽi yŏgadĕgāni
vāvivardanadiyaide vachchi mŏkkunu
śhrīveṁkaḍeśha nannum̐ jeri kūḍidivi nem̐ḍu
devulainadi yaidenu dīni kiṭṭĕ mĕchchunu