ఏమిసేతు నమ్మలాల యిదివో నాచందము
(॥పల్లవి॥)
ఏమిసేతు నమ్మలాల యిదివో నాచందము
వేమరు నాతని కిట్టె విన్నవించరే
(॥ఏమి॥)
చెలరేఁగీఁ బులకలు చిగిరించీఁ గోరికలు
తలఁపులో నాతనిఁ దలఁచితేను
నిలువెల్లాఁ జెమరించీ లెట్టుకొనీఁ దమకము
చెలులచే నాతనిచేఁతలు వింటేను
(॥ఏమి॥)
నిరతిఁ గరఁగీ మతి నిట్టూర్పు లెచ్చీ ముక్కున
బెరయ నాతని నిట్టె పేరుకొంటేను
వెరగు లుప్పతిల్లీ వెక్కసమయ్యా నాసలు
తిరిగి యాతనియింటి దిక్కు చూచితేను
(॥ఏమి॥)
పచ్చిదేరీఁ జెనకులు పైకొనీ సెలవినవ్వు
మెచ్చి యాతనిసొమ్ములు మేనఁ బెట్టితే
యిచ్చటికి వచ్చి నిన్ను నేలె శ్రీవేంకటేశుఁడు
మచ్చికతో వేడుకయ్యా మంతనాన నుంటేను
(||pallavi||)
emisedu nammalāla yidivo nāsaṁdamu
vemaru nādani kiṭṭĕ vinnaviṁchare
(||emi||)
sĕlarem̐gīm̐ bulagalu sigiriṁchīm̐ gorigalu
talam̐pulo nādanim̐ dalam̐sidenu
niluvĕllām̐ jĕmariṁchī lĕṭṭugŏnīm̐ damagamu
sĕlulase nādanisem̐talu viṁṭenu
(||emi||)
niradim̐ garam̐gī madi niṭṭūrbu lĕchchī mukkuna
bĕraya nādani niṭṭĕ perugŏṁṭenu
vĕragu luppadillī vĕkkasamayyā nāsalu
tirigi yādaniyiṁṭi dikku sūsidenu
(||emi||)
pachchiderīm̐ jĕnagulu paigŏnī sĕlavinavvu
mĕchchi yādanisŏmmulu menam̐ bĕṭṭide
yichchaḍigi vachchi ninnu nelĕ śhrīveṁkaḍeśhum̐ḍu
machchigado veḍugayyā maṁtanāna nuṁṭenu