Emisedu nammalaala yemdugaunu naayagumdu

ఏమిసేతు నమ్మలాల యెందుకౌను నాయకుఁడు
Language

(॥పల్లవి॥)
ఏమిసేతు నమ్మలాల యెందుకౌను నాయకుఁడు
బూమిలోఁ జెప్పఁ గొత్త యీపురుషవిరహము

(॥॥)
తొయ్యలిరాకకుఁ బతి తొంగిచూడఁ బోతేను
దయ్యమువలెఁ జంద్రుఁడు తలచూపెను
చయ్యన నందు కతఁడు జడిసి తలవంచితే
నుయ్యివలెనే తోఁ చె నూలుకొని మనసు

(॥॥)
మగువయెలుఁగు విన మతి నాలకించితేను
పగవానిరీతినే పల్కెఁ గోవిల
వెగటై యందు కతఁడు వీనులు మూసుకొంటే
మొగులువలెనే కప్పె ముంచుక విరహము

(॥॥)
నలినాక్షి రూపు మనసునఁ దలఁచఁబోతే
చిలుకుగాలమై తోఁచెను మరుఁడు
అలసె శ్రీవెంకటేశుఁ డంతలోన సతి గూడె
నెలకొని కొండవలె నిలిచె సంతోము

(||pallavi||)
emisedu nammalāla yĕṁdugaunu nāyagum̐ḍu
būmilom̐ jĕppam̐ gŏtta yīburuṣhavirahamu

(||||)
tŏyyalirāgagum̐ badi tŏṁgisūḍam̐ bodenu
dayyamuvalĕm̐ jaṁdrum̐ḍu talasūbĕnu
sayyana naṁdu kadam̐ḍu jaḍisi talavaṁchide
nuyyivalĕne tom̐ sĕ nūlugŏni manasu

(||||)
maguvayĕlum̐gu vina madi nālagiṁchidenu
pagavānirīdine palgĕm̐ govila
vĕgaḍai yaṁdu kadam̐ḍu vīnulu mūsugŏṁṭe
mŏguluvalĕne kappĕ muṁchuga virahamu

(||||)
nalinākṣhi rūbu manasunam̐ dalam̐sam̐bode
silugugālamai tom̐sĕnu marum̐ḍu
alasĕ śhrīvĕṁkaḍeśhum̐ ḍaṁtalona sadi gūḍĕ
nĕlagŏni kŏṁḍavalĕ nilisĕ saṁtomu