ఏమిసేతు నావలపే యింతసేసె నన్నును
(॥పల్లవి॥)
ఏమిసేతు నావలపే యింతసేసె నన్నును
కాముకులైనవారి కత లిటువంటివి
(॥ఏమి॥)
చక్కనినీమోము చూచె సందడిపరాకున
మక్కువతో నీకు మొక్కమఱచితిని
వెక్కసపునీకతలు వినేపరాకున
చిక్కనిప్రియము నీకుఁ జెప్పమఱచితిని
(॥ఏమి॥)
సారెసారె నీతో సరసములాడేపరాకున
చేరి కానుకియ్య మఱచితి నపుడు
మేరలేక నీతోనవ్వే మిక్కిలి పరాకున
పేరుకొని మాయింటికిఁ బిలువమఱచితి
(॥ఏమి॥)
కొలువు నీకుఁ జేసేటికూరిమిపరాకున
మలసి నిన్నుఁ జెనకమఱచితి
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ
తెలిపి నన్నేలితే నుతించమఱచితివి
(||pallavi||)
emisedu nāvalabe yiṁtasesĕ nannunu
kāmugulainavāri kada liḍuvaṁṭivi
(||emi||)
sakkaninīmomu sūsĕ saṁdaḍibarāguna
makkuvado nīgu mŏkkamaṟasidini
vĕkkasabunīgadalu vinebarāguna
sikkanipriyamu nīgum̐ jĕppamaṟasidini
(||emi||)
sārĕsārĕ nīdo sarasamulāḍebarāguna
seri kānugiyya maṟasidi nabuḍu
meralega nīdonavve mikkili parāguna
perugŏni māyiṁṭigim̐ biluvamaṟasidi
(||emi||)
kŏluvu nīgum̐ jeseḍigūrimibarāguna
malasi ninnum̐ jĕnagamaṟasidi
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśha
tĕlibi nannelide nudiṁchamaṟasidivi