Emisedu naamohamu iduvalem jesee nannu

ఏమిసేతు నామోహము ఇటువలెఁ జేసీ నన్ను
Language

(॥పల్లవి॥)
ఏమిసేతు నామోహము ఇటువలెఁ జేసీ నన్ను
ఆముక యెంతచిత్తిణి యనకుమీ నన్నును

(॥ఏమి॥)
చేరి వద్దనుండఁగాను సిగ్గులు పైకొనుఁగాని
వూరకే నీమోము చూడకుండఁగరాదు
బీరముతో నెమ్మెలకు పెనఁగులాడుటగాని
వొరిచి నిన్ను గుబ్బల నొత్తకుండరాదు

(॥ఏమి॥)
పట్టినమోనము లోలో పంతాలు రేఁచుఁగాని
అట్టె ముచ్చటమాట లాఁపఁగరాదు
వట్టిపొలయలుకలు వాసులు వుట్టించుఁగాని
నెట్టుకొన్నతమకము నిలుపఁగరాదు

(॥ఏమి॥)
నెలకొన్న కూటములు నివ్వెరగందించుఁగాని
తలకొన్నతలపులు దాఁచఁగరాదు
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
అలమి నన్నేలితివి ఆవుఁగాదనరాదు

(||pallavi||)
emisedu nāmohamu iḍuvalĕm̐ jesī nannu
āmuga yĕṁtasittiṇi yanagumī nannunu

(||emi||)
seri vaddanuṁḍam̐gānu siggulu paigŏnum̐gāni
vūrage nīmomu sūḍaguṁḍam̐garādu
bīramudo nĕmmĕlagu pĕnam̐gulāḍuḍagāni
vŏrisi ninnu gubbala nŏttaguṁḍarādu

(||emi||)
paṭṭinamonamu lolo paṁtālu rem̐sum̐gāni
aṭṭĕ muchchaḍamāḍa lām̐pam̐garādu
vaṭṭibŏlayalugalu vāsulu vuṭṭiṁchum̐gāni
nĕṭṭugŏnnadamagamu nilubam̐garādu

(||emi||)
nĕlagŏnna kūḍamulu nivvĕragaṁdiṁchum̐gāni
talagŏnnadalabulu dām̐sam̐garādu
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
alami nannelidivi āvum̐gādanarādu