ఏమిసేత మేమిసేత మేవంక చూచినాఁ దామె
(॥పల్లవి॥)
ఏమిసేత మేమిసేత మేవంక చూచినాఁ దామె
దోమటి నాకెకు నాకు దొరసీ నేఁ డిపుడె
(॥ఏమి॥)
కాసీ నదొకటి కాంతనవ్వువెన్నెలలు
వూసీ నదొకటి పూఁవవలపు
రాసీ నదొకవంక రాఁపుఁగుచములు రెండు
యేసీ మయఁ డీవంక నేమి సేసేదే
(॥ఏమి॥)
చిమ్మీ నదొకటి చెలిచూపుల చీఁకటి
కమ్మీ మాటలనె కమ్మఁదేనెలు
తుమ్మీఁ జింకతుమ్ములు తుమ్మిదగుంపుల కొప్పు
అమ్మీ నల్లదె పాయ మాకెకె నన్నును
(॥ఏమి॥)
చాఁచీ నదొకటి సతికాఁగిటికిఁ జేయి
పూఁచీ నదొకటి బువ్వపుమోవి
యేఁచీ యిట్టె శ్రీవేంకటేశుఁడ గనక నన్ను
లాచి కూడె నీమగువ లాగాయ నిఁకను
(||pallavi||)
emiseda memiseda mevaṁka sūsinām̐ dāmĕ
domaḍi nāgĕgu nāgu dŏrasī nem̐ ḍibuḍĕ
(||emi||)
kāsī nadŏgaḍi kāṁtanavvuvĕnnĕlalu
vūsī nadŏgaḍi pūm̐vavalabu
rāsī nadŏgavaṁka rām̐pum̐gusamulu rĕṁḍu
yesī mayam̐ ḍīvaṁka nemi sesede
(||emi||)
simmī nadŏgaḍi sĕlisūbula sīm̐kaḍi
kammī māḍalanĕ kammam̐denĕlu
tummīm̐ jiṁkadummulu tummidaguṁpula kŏppu
ammī nalladĕ pāya māgĕgĕ nannunu
(||emi||)
sām̐sī nadŏgaḍi sadigām̐giḍigim̐ jeyi
pūm̐sī nadŏgaḍi buvvabumovi
yem̐sī yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍa ganaga nannu
lāsi kūḍĕ nīmaguva lāgāya nim̐kanu